Sunday, November 24, 2019

google search engline tips



Read also:

చేతిలో స్మార్ట్​ఫోన్​ ఉంది.. డౌట్​ ఏదైనా ఉంటే అడగండి.. గూగుల్​లో సెర్చ్​ చేసి చిటికెలో చెప్పేస్తా’ననే ధీమాలో ఉన్నారా? గూగుల్​ సెర్చింగ్​లో మీరే కింగ్​ అనుకుంటున్నారా? మీకో విషయం తెలుసా.మీరు వెరీ పూర్​. మీరే కాదు.మీ చుట్టూ ఉన్నవారిలో 80 శాతం మంది మీలాంటివారే.

ఇంటర్నెట్​ లేనిరోజుల్లో ఏదైనా తెలుసుకోవడానికి పెద్దవాళ్ల సాయం తీసుకునేవాళ్లం. అమ్మానాన్నలు, నానమ్మ తాతయ్యలు, టీచర్లు, లెక్చరర్లు, ఎక్స్​పర్ట్స్​.. మనకు తెలియని ఎన్నో విషయాల గురించి చెప్పింది వీళ్లే. మరి మన పిల్లలకు కూడా వీళ్లే చెబుతున్నారా? నో..! ఇంటర్నెట్​ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. స్మార్ట్​ఫోన్​ చేతిలోకి వచ్చిన తర్వాత.. కావాలసినంత డేటా అతి తక్కువ ధరకే దొరుకుతున్న ఈ రోజుల్లో.. డౌట్స్​ క్లియర్​ చేసుకోవడానికి ఇంకా పెద్దవాళ్ల సాయం అవసరమా? జస్ట్​ గూగుల్​ చేస్తే సరిపోతుంది కదా? ఈ తరం పిల్లల్లో చాలామంది అభిప్రాయం ఇదే. పెద్దవాళ్లు ఏదైనా చెప్పినా‘నీకేం తెలియదమ్మా. ఊరుకో’అనేస్తున్నారు. గూగులమ్మ చెప్పిందే వేదమనుకుంటున్నారు. ఈ అభిప్రాయంతో ఉన్నవాళ్లంతా కచ్చితంగా చదవాల్సిన మ్యాటర్​ ఇది. ఎందుకంటే.మనలో 80 శాతం మంది గూగులింగ్​ చేయడంలో చాలా పూర్​ అని తాజాగా కొన్ని స్టడీలు తేల్చాయి.

అకడమిక్​ లైబ్రేరియన్స్​ 2011లో చేసిన ఓ స్టడీ ప్రకారం.. విద్యార్థుల్లో చాలామందికి తమకు కావలసిన సమాచారం కోసం గూగుల్​లో ఎలా సెర్చ్​ చేయాలో తెలియదు. ఏ పదాలను సెర్చ్​ బాక్స్​లో టైప్​ చేయాలో? చేశాక కనిపించే ఆప్షన్లలో ఏ పేజీని ఓపెన్​ చెయ్యాలో? కూడా తెలియదు. ఇటీవల స్టాన్​ఫోర్డ్​ రీసెర్చర్స్​ నిర్వహించిన స్టడీలో గూగుల్​ సర్వీసెస్​ను వాడుతున్న 80 శాతం మందికి దానిని సరిగ్గా ఉపయోగించడం రాదని తేలింది. ఎన్నో ప్రయత్నాల తర్వాతే వారికి కావలసిన సమాచారం పొందుతున్నారట. కొందరైతే ముందుగా ఏ ఇన్ఫర్మేషన్​ కనిపిస్తే అదే కరెక్ట్​ అనుకుంటున్నారట. సరైన సమాచారం కోసం రెండో ప్రయత్నం చేయకుండానే ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారట. ఇక పిల్లల విషయానికి వస్తే.. గూగులింగ్​లో ఎబోవ్​ యావరేజ్​ అనిపించుకుంటున్నవాళ్లు వందలో కనీసం ఐదారుగురు కూడా ఉండడం లేదట.

నిజానికి మనకు కావాల్సిన ఏ సమాచారమైనా గూగుల్​లో ఉంటుంది. కానీ సరైన సమాచారాన్ని వెతికిపట్టుకునే పద్ధతే చాలామందికి తెలియడం లేదు. అందుకే 80 శాతం మంది గూగులింగ్​లో పూర్​ అనిపించుకుంటున్నారు. వీళ్లందర్నీ ఎబోవ్​ యావరేజ్​ స్టేజ్​కు తీసుకురావడానికి గూగుల్​ సంస్థలో పనిచేస్తున్న సైంటిస్ట్​ డేనియల్​ రస్సెల్​ ‘ద జాయ్​ ఆఫ్​ సెర్చ్​’ పేరుతో రాసిన బుక్​లో కొన్ని టిప్స్​ సూచించారు. వాటిలో కనీసం ఈ ఐదు టిప్స్​ పాటిస్తే.. పూర్​ స్టేజీ నుంచి బెటర్​ అనిపించుకోవడం ఖాయమంటున్నారు ఎక్స్​పర్ట్స్​.

సెర్చ్​​ స్కిల్స్​ను మెరుగుపర్చుకోవడానికి పాటించాల్సిన టిప్స్​ గురించి రస్సెల్​ కొన్నేళ్లుగా తన బ్లాగ్​లో కూడా రాస్తున్నారు. అయితే కొత్త రెసిపీ కోసమో, దగ్గర్లో ఉన్న ఫార్మసీ అడ్రెస్​ కోసమో కాకుండా ఏదైనా విషయంపై అక్యూరేట్​ ఇన్ఫర్మేషన్​ పొందడమెలా? అనేదానిపై బ్లాగ్​లో చాలా డీటెయిల్​గా వివరిస్తున్నారు. వాటిలో టాప్​ టిప్స్​ ఇవి.

ఫస్ట్​ ఆన్సర్​తోనే ఆగిపోవద్దు.

గూగులింగ్​ చేసేటప్పుడు ఏదైనా సమాధానం కోసం సెర్చ్​ చేస్తుంటే.. వచ్చే ఫస్ట్​ ఆన్సర్​ దగ్గరే ఆగిపోవద్దు. అదే ఫైనల్​ ఆన్సర్​ అని కూడా అనుకోవద్దు. కనీసం రెండు మూడుసార్లయినా సెర్చ్​ చేస్తుంటే డిఫరెంట్​ ఆన్సర్స్​ వస్తాయి. అప్పుడు వాటిలో నుంచి అక్యూరేట్​ ఆన్సర్​ ఏదో సెలెక్ట్​ చేసుకోవడం ఏమంత కష్టం కాదు. పైగా ఆ ఆన్సర్​ తప్పు అయ్యే ఛాన్సే ఉండదు. ఒకటికి మించి సమాధానాలు దొరికే అవకాశం కూడా ఉంటుంది.

ఎవరు చెప్పారు. ఎందుకు

గూగుల్​ను ఏదైనా అడిగినప్పుడు సమాధానం కనిపించిన వెంటనే దానిని ‘ఎవరు చెప్పారు?’ ‘ఎందుకు’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. చాలామంది తమ వెబ్​సైట్​లో ఇన్ఫర్మేషన్​ పెట్టినప్పుడు ఆయా సందర్భాలకు అనుగుణంగా ఆన్సర్స్​ ఉండే అవకాశముంది. మరికొంతమంది కొన్ని ప్రయోజనాలను ఆశించి ఇన్ఫర్మేషన్​ పెడుతుంటారు. పొరపాటున అదే నిజమని మనం డిసైడ్​ అయితే.. వారి వలలో పడినట్లే. అందుకేసమాధానం కనిపించిన వెంటనే సోర్స్​ గురించి ఓసారి తెలుసుకోండి. ఆ ఇన్ఫర్మేషన్​ను పెట్టినవారు ఫేక్​ కాదని డిసైడ్​ చేసుకున్న తర్వాతే సమాధానం నిజమైనదని నమ్మొచ్చు.

మీ ఆన్సర్​ను సెర్చ్​ చేయొద్దు

మనకు తెలిసిన ఆన్సర్​ను కలుపుతూ సెర్చ్​ చేయడం కూడా కరెక్ట్​ కాదు. ఎందుకంటే.. మనం టైప్​ చేసిన సమాధానానికి సంబంధించిన ఇన్ఫర్మేషనే మనకు స్క్రీన్​పై కనిపిస్తుంది. అటువంటప్పుడు అసలైన సమాధానం దొరక్కపోవచ్చు. ఏదైనా ప్రశ్నకు ఆన్సర్​ వెతుకుతున్నప్పుడు కేవలం ప్రశ్నను మాత్రమే టైప్​ చేసి సెర్చ్​ చేయండి. పొరపాటున కూడా మీకు తెలిసిన ఆన్సర్​ను ప్రశ్నతో కలిపే ప్రయత్నం చేయొద్దు.

కీ వర్డ్స్​దే.కీ రోల్​

ఏదైనా సెర్చ్​ చేసేముందు ఏయే కీవర్డ్స్​ను సెర్చ్​ బాక్స్​లో టైప్​ చేయాలో ఓసారి డిసైడ్​ చేసుకోవాలి. సెర్చింగ్​లో ఎక్స్​పర్ట్స్​ అనిపించుకున్నవాళ్లు ఒకటికి మించి ట్యాబ్స్​ ఓపెన్​ చేస్తారు. ఒక్కో ట్యాబ్​లో డిఫరెంట్​ కీవర్డ్స్​తో సెర్చ్​ చేస్తుంటారు. అటువంటప్పుడే ఎక్కువ ఇన్ఫర్మేషన్​ను తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. ఒకే ట్యాబ్​లో ఒకటి లేదా రెండు కీవర్డ్స్​తో సెర్చ్​చేస్తే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్​ మాత్రమే కనిపిస్తుంది.

బేసిక్​ ఆపరేటింగ్​ స్కిల్స్​.

ఏదైనా ర్చ్​ చేసేటప్పుడు మనకు కనీసం బేసిక్​ స్కిల్స్​ తెలిసుండాలి. కామాస్​, ఫుల్​స్టాప్స్​, కోలన్స్​, సెమీకోలన్స్​, ఇన్వర్టెడ్​ కామాస్​ వంటివి ఉపయోగించడం తెలిసుండాలి. కొన్నిసార్లు ఇవి లేకుండా సెర్చ్​ చేస్తే మనకు అవసరమైన సమాధానం రాకపోవచ్చు.
పొరపాటుగా ఇవి ఉపయోగించినా తప్పు సమాధానం రావచ్చు. కాబట్టి ఎటువంటి సందర్భంలో కామాను వాడాలి? సెమీకోలన్స్​ ఎప్పుడు వాడతారు? ఇన్వర్టెడ్​ కామాస్​ మధ్యలో ఏదైనా పదం ఉంటే దాని అర్థమేంటి? వంటి బేసిక్​ ఆపరేటింగ్​ స్కిల్స్​ గురించి అవగాహన పెంచుకోవాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :