Sunday, November 17, 2019

Good news for who are willing to take home loans



Read also:

అద్దె ఇల్లు కంటే అగ్గిట్టె లాంటి స్వంత ఇల్లు ఉంటే చాలని చాలామందికి ఆశ ఉంటుంది. ఇలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అందిస్తోంది. ఇందులో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పధకం కూడా ఒకటి. ఇది క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్. దీని కింద హోమ్ లోన్‌పై చెల్లించే వడ్డీపై సబ్సిడీ పొందొచ్చు. ఇందులో అర్బన్, రూరల్ అనే రెండు పథకాలు ఉంటాయి. అంతే కాకుండా సామాన్యులకు అందుబాటులో వార్షిక ఆదాయం ప్రాతిపదికన కూడ రుణం లభిస్తుంది.ఇకపోతే వార్షిక ఆదాయం రూ.18 లక్షలకు లోపు ఉన్న వారు హౌసింగ్ ఫర్ ఆల్ అర్బన్ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కీమ్‌ కింద వడ్డీ సబ్సిడీని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు, ఆదాయం తక్కువగా ఉన్న వారు పొందొచ్చు.
HomeLoan
అయితే ఈ స్కీమ్ కింద కొందరికి మాత్రమే రుణాలు లభిస్తాయి. కొన్ని దరఖాస్తులకు మాత్రమే ఆమోదం లభిస్తుంది.అదెవరికంటే తొలిసారిగా ఇల్లు కట్టుకుంటున్న వారికి మాత్రమే స్కీమ్ వర్తించేలా రూపొందించారు. అంతే కాకుండా ఈ స్కీమ్ కింద తక్కువ వడ్డీకే మహిళలకు రుణం లభిస్తుంది. ఇదే కాకుండా కొన్ని బ్యాంకులు మహిళలకు ఇతర ప్రయోజనాలు కూడా కల్పిస్తున్నాయి. ఇలాంటి వారు హోమ్ లోన్‌ను సులభంగానే పొందే అవకాశం ఉంది. ఇక ఈ లోనుకు అప్లై చేసుకునే విధానాన్ని గమనిస్తే.

ముందుగా రుణం కోసం ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లగా అక్కడ, సిటిజన్ అసెస్‌మెంట్ అనే ట్యాబ్ కనిపిస్తుంది. ఇందులో బెనిఫిట్ అండర్ద 3 కాంపొనెంట్స్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఇక తర్వాతి పేజీలో అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. తర్వాతి పేజీకి వెళ్లాక రుణ గ్రహీతలు వారి వ్యక్తిగత వివరాలను అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

అలాగే వీటితోపాటుగా అడ్రస్, కుటుంబ సభ్యుల వివరాలు కూడా అందించాలి. ఈ వివరాలు అన్ని ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయాలి. ఇకపోతే ఈ పధకాన్ని మూడు కేటగిరిల కింద అప్లై చేసుకోవచ్చు. అదేమంటే ఆర్థికంగా వెనుకబడిన వారు, మధ్యతరగతి వారు, తక్కువ ఆదాయం ఉన్నవారుగా విభజించగా వీరిలో వార్షిక ఆదాయం రూ.3 లక్షల వరకు ఈడబ్ల్యూఎస్ కిందకు, రూ.3 నుంచి రూ.6 లక్షల మధ్యలో ఆదాయం ఉన్న వారు ఎల్ఐజీ కిందకు, రూ.6 నుంచి రూ.18 లక్షల ఆదాయం ఉన్న వారు ఎంఐజీ కిందకు వస్తారు.

అలాగే మురికివాడల్లో నివసించేవారు కూడా స్కీమ్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇక మహిళల పేరుతో రుణం తీసుకుంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయని గుర్తుంచుకోండి. ఇంకెందుకు ఆలస్యం వెంటనే లోను కోసం ప్రయత్నించి మీ స్వంత ఇంటి కలను నిజం చేసుకోండి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :