Friday, November 29, 2019

Discount offer on samsung Galaxy phones



Read also:

శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్ 

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది . గెలాక్సీ స్మార్ట్ ఫోన్ల అమ్మకాల 10వ వార్షికోత్సవం సందర్భంగా స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించినట్లు శాంసంగ్ పేర్కొంది . గెలాక్సీ నోట్ 10 , గెలాక్సీ ఎస్ 10 , గెలాక్సీ ఏ - సిరీస్ స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చింది . నవంబర్ 28 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది . శాంసంగ్ ఈ - స్టోర్స్ , ఫ్లిప్ కార్ట్ , అమెజాన్ , పేటీఎంతోపాటు ఎంపిక చేసిన రిటైల్ దుకాణాల్లో కూడా ఫోన్లను కొనుగోలు చేయవచ్చు . హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు క్రెడిట్ కార్డు , డెబిట్ కార్డు ద్వారా గెలాక్సీ నోట్ 10 , గెలాక్సీ ఎస్ 10 ఫోన్లను కొనుగోలు కస్టమర్లకు రూ.6,000 వరకు క్యాష్ బ్యాక్ లభించనుంది . 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :