Friday, October 11, 2019

Sleeping hours for everyone



Read also:

రోజుకి ఎన్ని గంటలు నిద్రపోవాలో మీకు తెలుసా 

చాలా మందికి నిద్ర విషయంలో క్లారీటి ఉండదు. రోజులో ఎంత సేపు నిద్రపోవాలి. శరీరానికి ఎంత వరకు విశ్రాంతి అవసరం అనేది కన్ఫుజన్ గా ఉంటుంది. కొంత మంది పొద్దస్తమానం నిద్రపోతే, మరికొంత మంది వేళాపాళా లేకుండా నిద్రిస్తుంటారు. అయితే నిజానికి ఎన్ని గంటలు నిద్రపోవాలి. మనిషి శరీరానికి ఎన్ని గంటల నిద్రసరిపోతుంది. ఎన్ని గంటలు నిద్రపోతే మనిషి అరోగ్యంగా ఉంటారో ఓసారి తెలుసుకుందాం.

రోజులో మనిషికి ఏడు గంటల ప్రశాంతమైన నిద్ర పోవాలిని వైద్యులు చెబుతున్నారు. నిద్ర దాని కన్నా తక్కువైనా ఎక్కువైనా ప్రమాదమేనని శాస్రవేత్తలు చెబుతున్నారు. నిద్రలేమి వల్ల గుండె సంబంధిత వ్యాధులు అధికంగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అమెరాకాలోని వెస్ట్ వర్జీనియా యూనివర్సిటీకి చెందిన భారతీయ శాస్త్రవేత్త అనూప్ శంకర్ బృందం నిద్రపై జరిపిన పరిశోధనలు జరిపారు.

ఈ పరిశోధనలలో 30,000 మంది పెద్దవారిపై ఈ అధ్యయనం నిర్వహించారు రోజుకి ఏడు గంటలు నిద్రపోయే వారితో పోలిస్తే తొమ్మిది గంటలకుపైగా నిద్రపోయే వారికి గుండె సంబంధింత సమస్యలు వస్తున్నట్లుగా గుర్తించారు.. ఐదు గంటలు లేదా అంతకన్నా తక్కువ సమయం నిద్రించే వారిలో ఈ సమస్యలు మూడింతలు అధికంగా ఉన్నట్లు తెలిపారు. తక్కువ సమయం నిద్రించేవారిలో గుండెపోటు, పక్షవాతం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలింది. కావున ఎక్కువ,తక్కువ కాకుండా రోజులు ఏడు గంటలు నిద్రుస్తే అరోగ్యంగా ఉండవచ్చని పరిశోధకులు తెలిపారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :