Friday, October 11, 2019

Cash withdrawals many times without getting any intermediate charges-SBI



Read also:

ఏటీఎం ఛార్జీలు.ఈ మాట వింటే సామాన్యుల గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఏ ఏటీఎంలో ఎన్నిసార్లు డబ్బులు డ్రా చేస్తే ఎంతెంత ఛార్జీలు పడతాయో అని ఎప్పుడూ లెక్కలు వేస్తూనే ఉంటారు. బ్యాంకు ఇచ్చిన పరిమితికి మించి ఏటీఎంలో క్యాష్ డ్రా చేస్తే ఛార్జీలు చెల్లించక తప్పదు. ఏ బ్యాంక్ అయినా ఈ ఛార్జీలు వసూలు చేయడంలో తక్కువేమీ కాదు. అన్ని బ్యాంకులూ కస్టమర్ల దగ్గర ఏటీఎం ఛార్జీలు వసూలు చేస్తూనే ఉంటాయి. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఏటీఎంలల్లో మీరు ఎన్నిసార్లైనా డబ్బులు డ్రా చేయొచ్చు. ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎస్‌బీఐ అందిస్తున్న సరికొత్త సదుపాయం ఇది. కేవలం ఎస్‌బీఐ కస్టమర్లకు మాత్రమే ఈ అవకాశం. మరి ఛార్జీలు పడకుండా ఏటీఎంలో ఎన్నిసార్లైనా డబ్బులు డ్రా చేయడం ఎలాగో తెలుసుకోండి.
SBI-YONO-cash
SBI-YONO-cash

Cash withdrawals many times without getting any intermediate charges-SBI

  • మీ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉందా? అయితే మీరు యోనో క్యాష్ ఫెసిలిటీ ఉపయోగించుకోవచ్చు. 
  • దీని ద్వారా ఎన్నిసార్లైనా ఏటీఎంలో డబ్బులు డ్రా చేయొచ్చు. 
  • అదనంగా ఛార్జీలేవీ చెల్లించాల్సిన అవసరం లేదు. అందుకే మీరు కార్డ్‌లెస్ విత్‌డ్రాయల్స్‌లోకి మారాలని కోరుతోంది ఎస్‌బీఐ. అంటే ఏటీఎం కార్డు లేకుండా ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడం అన్నమాట. 
  • మీ కార్డ్‌లెస్ విత్‌డ్రాయల్స్‌ని మీరు ఎన్ని సార్లైనా చేసే అవకాశం కల్పిస్తోంది ఎస్‌బీఐ. 
  • ఎస్‌బీఐ యోనో యాప్‌తో ఇది సాధ్యం. మీరు యోనో యాప్ డౌన్‌లోడ్ చేసుకొని మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.
  • యాప్‌కు 6 అంకెల ఎంపిన్ సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత యోనో క్యాష్ పైన క్లిక్ చేసి డబ్బులు డ్రా చేసుకోవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :