Thursday, October 31, 2019

irctc new money refund otp rule



Read also:

ఐఆర్ టీసీ కొత్త ఓటీపీ ఆధారిత రిఫండ్ ప్రారంభం
అధికారిక టికెటింగ్ ఏజెంట్ల వద్ద బుకింగ్ లకే వెసులుబాటు
వెయిటింగ్ జాబితాలో ఉన్న టికెట్ల క్యాన్సిల్ కు వర్తింపు
ఇక రైల్వే ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకుని ప్రయాణాన్ని రద్దుచేసుకుంటే వారికి ప్రయాణ చార్జీలు రిఫండ్ గా ఎంతవస్తాయో వారికి మొబైల్ సంక్షిప్త సందేశంలో తెలిసిపోతుంది. ఈ- టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నా లేదా వెయిటింగ్ లిస్ట్ టికెట్ వద్దనుకున్నా ఈ పద్ధతిలో ప్రయాణికులు తమ డబ్బును తిరిగి పొందడం సులువు కానుంది.
irctc
టికెట్ రద్దుచేయాలన్న ఆప్షన్ ను ఎన్నుకుంటే, ఆ ప్రయాణికుడి మొబైల్ కు  రైల్వేశాఖ సంక్షిప్త సందేశంలో ఓటీపీ నెంబర్ పంపుతుంది. ఆ నెంబర్ ను తాము టికెట్ బుక్ చేసుకున్న ఏజెంట్ కు చూపితే వారు నగదును తిరిగి ఇస్తారు. ఐఆర్ టీసీ అనుమతిపొందిన టికెట్ ఏజెంట్ల వద్ద టికెట్లు బుక్ చేసుకున్నవారికి ఈ వెసులుబాటు ఉంటుంది. ఈ- టికెట్ల విషయంలో పారదర్శకత, యూజర్ ఫ్రెండ్లీ వ్యవస్థను తీసుకురావడమే లక్ష్యంగా ఈ కొత్త విధానాన్ని ప్రారంభించినట్లు ఐఆర్ టీసీ వెల్లడించింది.  

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :