Wednesday, October 16, 2019

Ap cabinet decessions



Read also:

➧'వైఎస్ఆర్ చేనేత నేస్తం' పేరుతో ఏటా రూ.24వేలు చొప్పున ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏటా డిసెంబర్ 21న చేనేత కుటుంబాలకు ఈ ఆర్థిక సాయాన్ని బ్యాంకు ద్వారా అందించనున్నారు. ఒకే విడతలో రూ.24వేలు సాయం చేయాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 90వేల కుటుంబాలకు లబ్ది చేకూరనుంది.
➧మత్స్యకారుల సంక్షేమం విషయంలో మరో నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్. చేపల వేట నిషేధం సమయంలో మత్స్యకార కుటుంబాలకు నాలుగు వేల రూపాయల మేర ఆర్థిక సాయం అందించేవారు. ఆ మొత్తాన్ని పది వేల రూపాయలకు పెంచడానికి కెబినెట్ ఆమోదం. వీటిని నవంబర్ 21 న బ్యాంక్ అకౌంట్ లో వేయనున్నారు. మరియు 50% సబ్సిడీ తో డీజిల్ రేవుల దగ్గరే అందించే ఏర్పాట్లు.
➧మధ్యాహ్న భోజన ఏజెన్సీ ల గౌరవ వేతనం ఒక వెయ్యి నుంచి మూడు వేలకు పెంపు నిర్ణయం.
➧హోమ్ గార్డ్ ల రోజువారీ వేతనం ₹600 నుండి ₹710 కు పెంపు.
➧డిసెంబర్ 3 న జూనియర్ లాయర్ లకు ప్రోత్సాహకం.
➧ఇక డ్వాక్రా మహిళల కోసం గతంలో వెలుగు పేరుతో పథకం ఉండేది. ఇప్పుడు ఆ పథకం పేరును వై.ఎస్.ఆర్ క్రాంతిపథంగా మార్చారు. దీనికి కూడా మంత్రివర్గం ఆమోదం.
➧వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి నెలకు 105 లీ. నుండి 110లీ.  మంచినీటి సరఫరా.
➧ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఖాతాలకు నేరుగా డబ్బులు బ్యాంక్ అకౌంట్ లకే జీతాలు జమ.
➧APSRTC లో కాలం చెల్లిన బస్ ల స్థానంలో ₹1000 కోట్ల తో కొత్త బస్ లు.
➧చిరు ధాన్యాలు, అపరాల సాగుకు ప్రత్యేక బోర్డులు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :