Sunday, September 15, 2019

ఇక స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (SMC) పేరుకు బదులుగా పేరెంట్ మానిటరింగ్ కమిటీ లేదా పేరెంట్ కమిటీ



Read also:

ఇక స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (SMC) పేరుకు బదులుగా పేరెంట్ మానిటరింగ్ కమిటీ లేదా పేరెంట్ కమిటీ(PMC)

PMCఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ

పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికకు ఉత్తర్వులు విడుదల:

రాష్ట్రం లోని ప్రాధమిక,ప్రాధమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలలో పాఠశాల యాజమాన్య కమిటీల ఏర్పాటుకు  ప్రభుత్వం ఉత్తర్వులు  విడుదల చేసింది.
ఇప్పటి వరకు పాఠశాల యాజమాన్య కమిటీలుగా పిలవబడుతున్న పేరును పేరెంట్ మోనిటరింగ్ కమిటీ లేదా పేరెంట్ కమిటీ గా వ్యవహరించాలని పేర్కొంది.
దీని ప్రకారం.ఈ నెల 16 వతేదీ సోమవారం ఉదయం పది గంటలకు పాఠశాల స్థాయిలో మోనిటరింగ్  కమిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ల ఎన్నికకు నోటిఫికేషన్  విడుదల చేయాలి.
అదేరోజు మధ్యాహ్నం 2 గంటలకు పాఠశాలలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రుల లిస్ట్ పాఠశాల నోటీస్ బోర్డ్ ద్వారా  ప్రకటించాలి.
19 వ తేదీ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అభ్యంతరాలు స్వీకరించాలి.అదేరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటలకు ఓటర్ లిస్ట్ ఫైనల్ చేసి పాఠశాల నోటీస్ బోర్డ్ లో అంటించాలి.
23 వ తేదీ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పాఠశాల మోనిటరింగ్  కమిటీ ఎన్నిక నిర్వహించాలి.అ రోజు మధ్యాహ్నం 1:30 కి పేరెంట్ మోనిటరింగ్  కమిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ లను ఎన్నుకోవాలి.మధ్యాహ్నం 2 గంటలకి ప్రమాణస్వీకారం చేయాలి. మధ్యాహ్నం‌3 గంటలనుండి 3:30 గంటల వరకు మొదటి సమావేశం నిర్వహించాలి.
సభ్యుల ఎన్నిక మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ లు అన్నీ ఉపాధ్యాయులకు ఆయా మండల విద్యాశాఖాధికారుల ద్వారా తెలియచేయబడతాయి.ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలకు విద్యాకమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది•

ప్రభుత్వ,జిల్లా పరిషత్,మండల ప్రజాపరిషత్,మున్సిపల్,ఎయిడెడ్ పాఠశాలలకు  విద్యాకమిటీలు-ఏర్పాటు. విద్యాకమిటీ సభ్యుల పదవీకాలం రెండేళ్లు ఉంటుంది•గతంలో ఉన్న విద్యాకమిటీ సభ్యుల పదవీకాలం గత ఏడాది ఆగష్టుతో ముగిసింది.విద్యాకమిటీ ఎన్నికలు ఇలా
ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి మొత్తం 15 మందిలో కమిటీ ఏర్పాటు చేసుకోవాలి• ☆ఒక్కో తరగతికి ముగ్గురు చొప్పున విద్యార్థుల తల్లిదండ్రులను ఎన్నుకోవాలి• ఈలెక్కన ప్రాథమిక పాఠశాలల్లో ఐదు తరగతులకు సంబంధించి 15 మంది సభ్యులు ఉంటారు.
ప్రాథమికోన్నత పాఠశాలలకు తరగతికి ముగ్గురు చొప్పున ఏడు తరగతులకు కలిపి 21 మంది సభ్యులను ఎన్నుకుంటారు• అందులో ఒకరు చైర్మన్ గా,మరొకరిని వైస్ చైర్మన్ గా ఎన్నుకుంటారు• మిగిలిన వారు సభ్యులుగా ఉంటారు.
వీరితోపాటు ప్రతి పాఠశాలలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఆరుగురిని నియమిస్తారు.
సర్పంచి, వార్డుమెంబర్,అంగన్వాడీ వర్కర్,మహిళా మండలి సభ్యులు, ఇద్దరు టీచర్లను నియమించనున్నారు.

కమిటీ విధులు-భాధ్యతలు

1.పాఠశాల అభివృద్దికి విద్యాకమిటీ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది• పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు.
2.విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు పర్యవేక్షణ.
3.బడి బయట పిల్లలను గుర్తించి వారిని బడికి వచ్చేలా ఒప్పించడం.
4.మధ్యాహ్న భోజనం పర్యవేక్షణ.
5.స్కూల్ డెవలప్ మెంట్ ప్లానింగ్ తయారు చేయడం,ప్లానింగ్ ను సక్రమంగా అమలు అయ్యేలా చూడటం.
6.పాఠశాలలకు విడుదల అయిన నిధులు సక్రమంగా వినియోగం అయ్యేలా పర్యవేక్షణ చేయడం.
7.దాతలను, పూర్వ విద్యార్థులను ప్రోత్సహించి పాఠశాలలకు మౌలిక సదుపాయాలు పెంచాల్సి ఉంటుంది.
DOWNLOAD PMC COMMITTEE SCHEDULE

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :