Sunday, September 15, 2019

ఆంధ్రాలో కొత్త జిల్లాల లిస్ట్ ఇదే



Read also:

గవర్నర్ తో ముగిసిన జగన్ భేటీ - ఆంధ్రాలో కొత్త జిల్లాల లిస్ట్ ఇదే 
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి కొత్త జిల్లాల ముచ్చట వినిపిస్తుంది . ఈ ప్రతిపాదన ఎప్పటి నుండో ఉన్న కానీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నుండి దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు . ఒక్కో లోక్ సభ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ప్రకటించాలనే ప్రతిపాదన ఉంది . గతంలో చంద్రబాబు గెలిచిన తర్వాత జిల్లాలు పెంచటం మీద చర్చలు జరిగిన కానీ , అసెంబ్లీ నియోజకవర్గాలు పెంచితే , వాటితో పాటుగా జిల్లాలు పెంచాలని బాబు అనుకున్నాడు , దీనితో అటు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగలేదు , ఇటు జిల్లాలు పెరగలేదు . తాజాగా ముఖ్యమంత్రి జగన్ కొత్త జిల్లాల గురించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందర్ తో బుధవారం సమావేశం అయ్యినట్లు తెలుస్తుంది . కొత్త జిల్లాల వలన పరిపాలన మరింత సులభం అవుతుందని , ప్రజలకి ప్రభుత్వ సేవలు అతి తక్కువ సమయంలోనే నేరుగా అందించవచ్చని జగన్ అభిప్రాయపడినట్లు తెలుస్తుంది . దీనికి గవర్నర్ కూడా సానుకూలంగా స్పదించినట్లు సమాచారం . ఈ నాలుగు నెలలు కొత్త జిల్లాల సంబంధించిన పనులు పూర్తిచేసి వచ్చే ఏడాది జనవరి 26 నాటికి కొత్త జిల్లాలను అమల్లోకి తీసుకొనిరావాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది . కొత్త జిల్లాలుగా పార్లమెంట్ నియోజకవర్గాలు ప్రకటించాలని ఆలోచనగా తెలుస్తుంది . 

కొత్త జిల్లాలు 

1 . అరకు
2 . శ్రీకాకుళం
3 . విజయనగరం
4 . విశాఖపట్టణం
5 . అనకాపల్లి
6 . కాకినాడ
7 . అమలాపురం
8 . రాజమండ్రి
9 . నరసాపురం
10 . ఏలూరు
11 . మచిలీపట్నం
12 . విజయవాడ
13 . గుంటూరు
14 . నరసారావుపేట
15 . బాపట్ల
16 . ఒంగోలు
17 . నంద్యాల
18 . కర్నూల్
19 . అనంతపురం
20 . హిందూపుర్
21 . కడప
22 . నెల్లూరు
23 . తిరుపతి
24 . రాజంపేట
25 . చిత్తూరు

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :