Tuesday, September 3, 2019

ఎస్‌బీఐ యోనో‌యాప్ తో పొందే సేవలు



Read also:

ఎస్‌బీఐ యోనో‌యాప్ తో పొందే సేవలు

SBI-YONO
  • బేసిక్ బ్యాకింగ్ ట్రాన్సాక్షన్లు పూర్తి చేయవచ్చు.
  • బ్యాలెన్స్ చెకింగ్, ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ తెరవడం, బెనిఫీషియరీ యాడ్ చేసుకోవడం వంటి సేవలు పొందొచ్చు.
  • కొత్త యాడ్ చేసుకున్న బెనిఫీషియరీకి వెంటనే రూ.10,000 పంపొచ్చు.
  • ఎస్‌బీఐ ఇతర సంస్థల నుంచి మీరు పొందుతున్న సేవలను ఒకేచోటు లింక్ చేసుకోవచ్చు.
  • క్రెడిట్ కార్డ్స్, లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్, సిప్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్‌మెంట్లు వంటి వాటిని ఒకే యోనో యాప్‌తో చూసుకోవచ్చు.
  • ఇంటెలిజెంట్ అనాలసిస్ ఫీచర్‌తో ఎంత ఖర్చు చేశారనే ఓవర్‌వ్యూ చూడొచ్చు.
  • యాప్‌లో లావాదేవీలు ఆటోమేటిక్‌గా ఒక్కో కేటగిరిగా విడిపోతాయి.
  • ప్రి-అప్రూడ్ రుణం కూడా పొందొచ్చు.
  • ఈ రుణ మొత్తం కేవలం 2 నిమిషాల్లోనే బ్యాంక్ ఖాతాలో జమవుతుంది.
  • రూ.5 లక్షల వరకు రుణ సదుపాయం ఉంటుంది.
  • ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదు.
  • ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కూడా ఉంది.
  • చెక్‌బుక్, ఏటీఎం కార్డు/డెబిట్ కార్డు, ఏటీఎం కార్డు బ్లాక్ వంటి వాటికి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు.
  • ఏదైనా సమాచారం కోసం సియా సాయం తీసుకోవచ్చు. ఆటోమేటెడ్ చాట్‌బాట్.
  • ఇది సేవింగ్స్ అకౌంట్, డిపాజిట్స్, బిల్ పేమెంట్స్, ప్రిఅప్రూవ్డ్ లోన్స్, షాపింగ్, ఇన్వెస్ట్‌మెంట్స్, వడ్డీ రేట్లు వంటి పలు అంశాలకు సంబంధించిన వివరాలు అందిస్తుంది.
  • ఆన్‌లైన్ షాపింగ్ చేయొచ్చు. దిగ్గజ ఈ-కామర్స్ పోర్టల్స్‌లో ప్రొడక్టులను కొనుగోలు చేసే సౌకర్యం ఉంది.
  • ట్రావెల్ టికెట్లు, సినిమా టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ గ్రాసరీ సరుకులు కూడా కొనొచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :