Wednesday, September 18, 2019

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్..రిటైర్మెంట్ వయస్సు తగ్గించే యోచనలో మోదీ సర్కార్ .



Read also:

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్..రిటైర్మెంట్ వయస్సు తగ్గించే యోచనలో మోదీ సర్కార్ .

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును తగ్గించాలని మోదీ ప్రభుత్వం యోచిస్తోంది.  తాజా ప్రతిపాదనల ప్రకారం ఉద్యోగుల పదవీ విరమణ రెండు ప్రమాణాలుగా నిర్ణయించబడుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి 33 ఏళ్ల సర్వీస్‌ను పూర్తి చేసి  ఉండడం లేదా వారి వయస్సు 60 ఏళ్లు నిండినట్లయితే పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనలో IAS, IPS నుండి కేంద్ర ప్రభుత్వంలోని  అన్ని వర్గాల ఉద్యోగాలకు వర్తిస్తుంది. అయితే ప్రస్తుతం  కేంద్ర ప్రభుత్వంలో చాలా ఉద్యోగాలకు పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలుగా ఉన్న సంగతి తెలిసిందే.

అయితే పదవీ విరమణ వయస్సు తగ్గింపు  ప్రతిపాదన కొత్తది కాదని ప్రభుత్వం చెప్పుకొస్తుంది.

ఇది ఏడవ వేతన సంఘంలో కూడా ప్రస్తావించబడిందని గుర్తు చేస్తోంది. ఈ ప్రతిపాదనకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే  ప్రారంభమైందని సమాచారం. అధికారుల, ఉద్యోగుల జాబితాను అన్ని విభాగాలు సిద్ధం చేస్తోందని సిబ్బంది శిక్షణ శాఖ (డిఓపిటి) వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రణాళికను వివిధ దశల్లో అమలు చేయనున్నట్లు వర్గాలు తెలిపాయి. పదవీ విరమణ యొక్క కొత్త నియమాలను వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేయవచ్చు.

సాయుధ దళాలలో చేరాలంటే ఉద్యోగి వయస్సు సగటున 22 కలిగి ఉండాలి కాబట్టి ఈ నిర్ణయం భద్రతా దళాలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.  కాబట్టి వారు  33 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసేసరికి 55 పూర్తి చేసుకుంటారు. దీంతో పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. పదవీ విరమణ వయస్సు తగ్గించడం  ద్వారా దేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించవచ్చని  కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును తగ్గించడం వల్ల యువతకు ఉద్యోగాలు లభిస్తాయని యోచిస్తోంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :