Thursday, August 8, 2019

Discussions with Honorable education minister



Read also:

ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖామంత్రి సమావేశం
 సమావేశంలో చర్చించిన అంశాలు: 
Discussions with Honorable education minister

1. సర్వీస్ రూల్స్ జిఓలు 73,74పై ఉన్న కోర్టు ఆటంకాలు తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేని పరిస్థితిలో 73, 74 ఆధారంగా అడ్హాక్ రూల్స్ రూపొందించాలి. అధికారులతో చర్చించి సత్వర నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలియజేశారు.
2. కేటగిరి-3లో అర్హత కల్గిన వారందరికి అప్గ్రేడ్ అయిన పండిత, పిఇటి పోస్టులు, ప్రమోషన్స్ ఇవ్వాలని అన్ని సంఘాలు కోరాయి.  చట్ట ప్రకారం అందరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
3. సర్వీస్ రూల్స్ పై త్వరలో ఓ నిర్ణయం తీసుకోవాలని, డివైఇఓ, డైట్ లెక్చరర్స్, ఎంఇఓ తదితర పోస్టులు భర్తీకి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. జూనియర్ లెక్చరర్స్ పోస్టులు భర్తీలో ఆటంకాలు తొలగించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.
4. ఉపాధ్యాయులకు బదిలీలు దసరా సెలవులలో జరిపేలా అనుమతించాలని కోరగా ముఖ్యమంత్రితో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని, పాఠశాలలకు ఆటంకం లేకుండా జరపాల్సి ఉంటుందని మంత్రి అన్నారు.
5. జిల్లాలో గత సంవత్సరం వేసిన డెప్యుటేషన్స్ అన్ని రద్దుచేసి ఈ విద్యా సంవత్సరంలో పెరిగిన ఎన్రోల్ మెంట్ ప్రకారం పని  సర్దుబాటు చేయుటకు అంగీకరించారు.
6. అకడమిక్ క్యాలెండర్ అన్ని యాజమాన్యాల్లో ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు.
7. పాఠశాలలకు అయ్యే విద్యుత్ బిల్లులు సెంట్రలైజ్డ్గా చెల్లించేందుకు పరిశీలిస్తామన్నారు.
8. పాఠశాలల్లో పనిచేసే స్కావెంజర్స్ జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
9. ఉపాధ్యాయులకు భారం కాకుండా యాప్లు మార్పు చేస్తామని, బయోమెట్రిక్లో సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు.
10. మెడికల్ రీయింబర్స్మంట్ బిల్లులు ఆలస్యం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని
11. ప్రతినెలా ప్రమోషన్స్ కొనసాగిస్తామని, 610 పరిధిలో ఉన్నవారికి కూడా ప్రమోషన్స్ విషయంలో అధికారులతో చర్చించి  పరిష్కారం చేస్తామని అన్నారు.
12. ఎయిడెడ్ టీచర్ల సమస్యలు పరిష్కారం చేస్తామని, హెల్త్ కార్డులకు త్వరలో చర్యలు తీసుకోవాలని, ఎస్సి, ఎస్టీ అన్టైన్ | టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
13. 398/- స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు, ఎసిసి, ఎస్టి టీచర్లకు స్టడీలీవు తదితర సమస్యలపై చర్చించుట జరిగింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :