Tuesday, August 20, 2019

Isro report about chandrayaan2



Read also:

చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్ 2 హైదరాబాద్ : చంద్రయాన్2ను విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టారు . సుమారు 30 రోజుల ప్రయాణం తర్వాత చంద్రయాన్ 2 నిర్దేశిత కక్ష్యలోకి చేరుకున్నది . అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ ను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది . లూనార్ ఆర్బిట్ ఇన్ సర్జన్ ప్రక్రియ ఇవాళ ఉదయం 9 గంటల 2 నిమిషాలకు మొదలైందని ఇస్రో తన ట్వీట్ లో చెప్పింది . సుమారు 1738 సెకన్ల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది . 114 km x 18072 కిలోమీటర్ల ఎత్తులో చంద్రయాన్2 తన కక్ష్యలోకి ప్రవేశించింది . ఇక చంద్రుడి ఉపరితలానికి వంద కిలోమీటర్ల ఎత్తులో , సుమారు 100 | km X 30 కిలోమీటర్ల దూరంలో త్వరలో చంద్రయాన్2 మరికొన్ని కీలక ప్రక్రియలు నిర్వహిస్తుంది . ఇక్కడే ఆర్బిటార్ నుంచి విక్రమ్ ల్యాండర్ వేరుపడనున్నది . ఆ తర్వాత చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ దిగుతుంది . సెప్టెంబర్ 7వ తేదీన చంద్రుడి దక్షిణ ద్రువంపై ల్యాండర్ దిగుతుంది .

చంద్రయాన్ 2 వ్యోమనౌక తగిన వెలాసిటీతో కక్ష్యలోకి ప్రవేశించినట్లు ఇస్రో వర్గాలు చెబుతున్నాయి . ఈ ప్రక్రియలో ఎటువంటి పొరపాటు జరిగినా . . చంద్రయాన్ 2 పరీక్ష విఫలమయ్యేది . కానీ ఇస్రో శాస్త్రవేత్తలు అత్యంత కష్టమైన ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించారు . చంద్రయాన్ 2 వ్యోమనౌక సుమారు 39 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లింది . ఇది ధ్వని వేగం కన్నా 30 రేట్లు ఎక్కువ . జూలై 22న శ్రీహరికోట నుంచి చంద్రయాన్2 ఎగిరిన విషయం తెలిసిందే . ఒకవేళ ల్యాండర్ చంద్రుడిపై దిగితే . . ఇక ఆ ఘనతను సాధించిన నాలుగవ దేశంగా భారత్ నిలుస్తుంది . రష్యా , అమెరికా , చైనా దేశాల రోవర్లు ఇప్పటికే మూన్ పై దిగాయి . గత ఏడాది ఇజ్రాయిల్ ఇదే పరీక్షలో విఫలమైంది .
For more info join our what's app group

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :