Tuesday, August 27, 2019

చంద్రయాన్ 2 సరికోత్త ఫోటోలు



Read also:

మరోకొద్ది రోజుల్లో చంద్రయాన్ 2 ప్రయోగం పూర్తి దశలోకి రానున్న నేపథ్యంలోనే ఫలితాలు వెలువడుతున్నాయి. ఇటివలే ఆగస్టు 21న తొలి ఫోటోను పంపిణ చంద్రయాన్ 2 ఉపగ్రహం నేడు మరో ఫోటోను పంపింది. చంద్రయాన్2లో ఉన్న టెర్రయిన్ మ్యాపింగ్ కెమెరా 2 తీసీని ఫోటోను ఈ ఫోటోను ఇస్రో తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది. కాగా ఈ ఫోటోలు మొదటి ఫోటో పంపిణ రెండు రోజులకు అనగా ఆగస్టు 23న చంద్రయాన్2లో ఉన్న కెమెరా తీసీనట్టు తెలిపారు. కాగా చంద్రుడి ఉపరితలంపై ఉన్న లోయలను ఈ చంద్రయాన్2లోని కెమెరాలు బంధించాయి.ఆగస్టు 21న చంద్రుడి ఉపరితలం నుండి 2650 కి.మీ దూరంలో ఎత్తులో నుండి మొదటి ఫోటోను పంపిణ చంద్రయాన్2 ఆగస్టు23న టీఎంసీ 2 నుండి 4375 కిలోమీటర్ల దూరం నుండి తీసింది.
Chandrayaan2
దీని ద్వార జాక్సన్ ,మాచ్, కొరలేవ్, మిత్రా అనే పేర్ల మీద ఉన్న ఆగాధాలు (కేటర్స్ ) కనిపించినట్టు ఇస్రో అధికారులు తెలిపారు. జాక్సన్ లోయ చంద్రుడి ఉత్తర ద్రువం వైపున ఉండగా, సుమారు 71 కిలోమీటర్ల వెడల్పుతో ఉంది. ఇక మిత్రా క్రేటర్ సుమారు 92 కిలోమీటర్ల వెడల్పుతో ఉన్నట్టు ఇస్రో తెలిపింది. కాగా చంద్రయాన్2 సెప్టెంబర్ 7న తెల్లవారు జామున 1.40 నిమిషాలకు ల్యాండ్ పదిహేను నిమిషాల్లో పూర్తి కానుంది. కాగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్ ను ఇస్రో కిందటి నెల 22వ తేదీన నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి ప్రయోగించిన విషయం తెలిసిందే. చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన తరువాత కూడా నాలుగు దశలను పూర్తి చేసుకున్న అనంతరమే చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడిపై దిగగలుగుతుంది. క్రమంగా చంద్రుడి ధృవాల వైపు ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల దూరంలోకి చేరుకుంటుంది. అదే చివరి దశ. వచ్చేనెల 7వ తేదీ నాటికి చివరి దశ పరిభ్రమణానికి చేరుకుంటుందని ఇస్రో అధికారులు వెల్లడించారు.
ISRO TWEET ON TWITTER-IMAGE
Interesting facts about chandrayaan2

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :