Monday, July 15, 2019

Chandrayaan2 abandoned due to technical issues



Read also:

Chandrayaan2 abandoned

సాంకేతిక కారణాలతో చంద్రయాన్ 2 ప్రయోగం వాయిదా.. చంద్రయాన్ 2 ప్రయోగం వాయిదా పడింది. 130 కోట్ల మంది ఎదురు చూసిన సమయానికి కొన్ని నిమిషాల ముందు కౌంట్ డౌన్ నిలిచిపోయింది. 19 గంటల 4 నిమిషాల 36 సెకన్ల వద్ద కౌంట్ డౌన్ ప్రక్రియ ఆగిపోయింది. తాత్కాలికంగా కౌంట్ డౌన్ ను శాస్త్రవేత్తలు నిలిపివేశారు. 
Chandrayaan2 abandoned
సాంకేతిక లోపాన్ని సరి చేసే పనిలో ఇస్రో శాస్త్రవేత్తలున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చంద్రుడి పైకి పంపాల్సిన చంద్రయాన్-2 ప్రయోగం నిలిచిపోయింది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రస్తుతానికి ఆగిపోయింది. కొత్త తేదీని త్వరలోనే ఇస్రో ప్రకటించనుంది. అంతా సవ్యంగా సాగుతుందనుకునే సమయంలో టి-56 నిమిషంలో వాహక నౌకలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగంను నిలిపివేసినట్లు ఇస్రో అధికారులు తెలిపారు. దీంతో చంద్రయాన్-2 ప్రయోగం వాయిదా పడింది. త్వరలోనే చంద్రయాన్ -2 చంద్రుడిపైకి పంపే తేదీని ఇస్రో ప్రకటిస్తుందని ప్రోగ్రామింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్ అధికారి గురుప్రసాద్ తెలిపారు. చంద్రయాన్-2 నింగిలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు 20 గంటలు ముందుగా ఆదివారం ఉదయం 6:51 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభించారు. 19గంటల 4 నిమిషాల 36 సెకన్లపాటు సాగిన కౌంట్ డౌన్ ఆగిపోయింది. ప్రయోగానికి 56 నిమిషాల 24 సెకన్లకు ముందు కౌంట్ డౌన్ నిలిపివేశారు. సాంకేతిక కారణాలతో ప్రయోగం వాయిదాపడింది. స్పేస్ క్రాఫ్ట్ నింగిలోకి ఎగిరిన తర్వాత సాంకేతిక సమస్యలు తలెత్తి ఉంటే మొత్తం ప్రాజెక్టు సముద్రపాలు అయ్యేది. ప్రాజెక్టుకు మొత్తం రూ.980 కోట్లు బడ్జెట్ తో చంద్రయాన్-2కు ఊపిరి పోశారు. అయితే ఇక్కడ డబ్బుల సమస్య కాదు కానీ ప్రపంచదేశాలు చంద్రయాన్-2ను ప్రయోగిస్తున్న భారత్ వైపే చూస్తున్నాయి. ఇప్పటివరకు చంద్రుడిపైకి తమ రోవర్లను పంపి పరిశోధనలు చేసిన దేశాలుగా అమెరికా, రష్యా, చైనా దేశాలు మాత్రమే ఘనత సాధించాయి. ఒకవేళ చంద్రయాన్-2 ప్రయోగం సక్సెస్ అయి ఉంటే భారత్ నాలుగో దేశంగా నిలిచేది. చంద్రయాన్-2 మిషన్ టేకాఫ్ ను చూసేందుకు వచ్చిన ఔత్సాహికులకు నిరాశే మిగిలింది. అయితే సాంకేతిక సమస్య ఎక్కడ వచ్చిందో అనేదానిపై మాత్రం పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :