Monday, July 15, 2019

Worldcup2019-england winners



Read also:

Winners of 2019 WorldCup -England

ప్రపంచ కప్: ఉత్కండ పోరులో విజయం సాధించిన ఇంగ్లాండ్ క్రికెట్ పుట్టినిల్లుగా పేరొందిన ఇంగ్లాండ్ ఇంతకాలం వరల్డ్ కప్ గెలుచుకోలేకపోవడం అనేది ఒక వెలితి అనే చెప్పవచ్చు. 
WorldCup2019
1975 నుంచి మొదలు 2015 వరల్డ్ కప్ వరకూ 3 సార్లు టోర్నీ ఫైనల్ కు చేరుకొని విశ్వవిజేత అయ్యే అవకాశం జారవిడుచుకున్నప్పటికీ,2019లో మాత్రం స్వదేశంలో క్రికెట్ మక్కా లార్డ్స్ మైదానంలో ఇంగ్లీష్ సేన ప్రపంచ కప్ ను అందుకుంది. టోర్నీ ఆసాంతం అద్వితీయమైన ప్రదర్శనతో అదరగొట్టిన మోర్గాన్ సేన ఫైనల్ లో కివీస్ జట్టును మట్టికరిపించి ప్రపంచ కప్ సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ విధించిన 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదనలో ఇంగ్లాండ్ 241 పరుగులకు ఆలౌటవ్వడంతో నాటకీయ పరిణామాల మధ్య మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయించాల్సి వచ్చింది. సూపర్ ఓవర్ లో తొలి ఛాన్స్ ఇంగ్లాండ్ కు దక్కగా ఆ ఓవర్లో మొత్తం 15 పరుగులు రాబట్టింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ కూడా 15 పరుగులే చేసింది. అయితే బౌండరీల ప్రాతిపదికన చూస్తే ఇంగ్లాండ్ సూపర్ ఓవర్ లో రెండు బౌండరీలు బాదగా, న్యూజిలాండ్ మాత్రం సూపర్ ఓవర్ లో బౌండరీలు బాదలేకపోయింది. దీంతో ఇంగ్లాండ్ విశ్వవిజేత అయ్యింది. ఇదిలా ఉంటే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ పరుగుల సాధనలో తడబడింది. వరుసగా వికెట్లు పడటంతో పాటు భారీ భాగస్వామ్యాలు నెలకొల్పడంలో కివీస్ బ్యాట్స్ మెన్ ఫెయిలయ్యారనే చెప్పవచ్చు. నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లాండ్ 241/8 స్కోరు సాధించడం విశేషం. కివీస్ ఓపెనర్లు మార్టిన్ గుప్తిల్, హెన్రీ నికోలస్ నిలకడగా ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ 6వ ఓవర్లో గుప్తిల్ ఔటయ్యాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ 30 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ సాధించిన హెన్రీ నికోలస్ (55) వేగంగా పరుగులు చేసే క్రమంలో ఔటయ్యాడు. అనంతరం రాస్ టైలర్ సైతం (15) స్వల్ప పరుగులకే ఔటయ్యాడు. అనంతరం వచ్చిన టామ్ లాథమ్ వికెట్లపై కుదురుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ స్కోరు 200 దాటింది. చివరగా మ్యాచ్ డ్రా అవ్వగా , యంపిరెస్ సూపర్ ఓవర్ ప్రకటించగా అందులో ముందుగా ఇంగ్లాండ్ 6 బాల్స్ కి 15 చేయగా న్యూజ్లాండ్ 16 పరుగుల ఛేదన లో ఓటమి చవిచూసింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :