Friday, July 19, 2019

Bad News for ticktok users



Read also:

Bad News for ticktok users

టిక్ టాక్ పై బ్యాన్ అస్త్రం ప్రయోగించనున్న కేంద్రం, 5 రాష్ట్రాలు.. మరో 2 రాష్ట్రాలూ..!! టిక్ టాక్, హలో యాప్ యూజర్లకు చేదు వార్త. వాటిని బ్యాన్ చేసేందుకు కేంద్రం సహా 5 రాష్ట్రాలు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే టిక్ టాక్ యాప్ నిషేధపుటంచులను తాకి వచ్చిన సంగతి తెలిసిందే. చైల్డ్ పోర్నోగ్రఫీ, విద్వేషపూరిత వీడియోలు జోరుగా చేస్తుండటం, వాటి వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని ఆగ్రహంతో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యాప్ పై కొరడా ఝులిపించేందుకు సిద్దమయ్యాయి. టిక్ టాక్కే చెందిన హలో యాప్ లో కూడా ఇలాంటివే ఎక్కువ అవుతున్నందున వాటిని బ్యాన్ చేయాలని చూస్తున్నాయి. చైనా కంపెనీ బైట్ డ్యాన్స్ కు చెందిన ఈ యాప్లపై తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, గుజరాత్ రాష్ట్రాలు నిషేధం విధించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. 
Tiktok
వీటితో పాటు పంజాబ్, కర్ణాటక రాష్ట్రాలు కూడా వీటిని బ్యాన్ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. విద్వేష పూరిత సందేశాలను వ్యాప్తి చేయడానికి ఈ యాప్లను వాడుతున్నారని, అయినా ఆ కంపెనీ వాటి నిరోధానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో కొరడా ఝులిపించనున్నట్లు తెలుస్తోంది. కొన్ని రాష్ట్రాలు టిక్ టాక్ ను బ్యాన్ చేయాలని కేంద్రాన్ని కోరాయి. వీటి ద్వారా విద్వేషం, చైల్డ్ పోర్న్ ఘటనలు జరిగినట్లు ఆధారాలు కూడా సమర్పించాయి. ఈ యాప్లను బ్యాన్ చేయడం ద్వారానే వాటిని తగ్గించవచ్చని భావించాయి' అని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు, కేంద్రం కూడా టిక్ టాక్, హలో సంస్థలకు 24 ప్రశ్నలను సంధిస్తూ నోటీసులు జారీ చేసింది. వాటికి తగిన జవాబు ఇవ్వలేకపోతే వీటిని బ్యాన్ చేస్తామని హెచ్చరించింది. ఆరెస్సెస్ కు చెందిన స్వదేశీ జాగరణ్ మంచ్.. ప్రధాని మోదీకి చేసిన ఫిర్యాదుతో కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, టిక్ టాక్, హలో సంయుక్తంగా మరో మూడేళ్లలో రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేసిన క్రమంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :