Friday, April 30, 2021

YSR Raithu Bharosa: వైఎస్ఆర్ రైతు భరోసా నమోదుకు ఇంకా రెండు రోజులే



Read also:

YSR Raithu Bharosa: వైఎస్ఆర్ రైతు భరోసా నమోదుకు ఇంకా రెండు రోజులే.. ఇలా దరఖాస్తు చేసుకోండి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh) మరో పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది. మే 13న రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏడాది వైస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం కింద ఏడాదికి రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది. ఇందులో కేంద్రం రూ.6వేలు ఇస్తుండగా. రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 ఇస్తోంది.

తొలివిడతలో భాగంగా అర్హులైన రైతులకు మే 13న రూ.7,500 చొప్పున నగదును నేరుగా వారి ఎకౌంట్లలోనే జమ చేయనుంది.

గత ఏడాది లబ్ధిపొందిన వారితో పాటు.అర్హత ఉండి రెండేళ్లుగా లబ్ధిపొందని రైతులకు కూడా ఈ సారి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఇచ్చింది.

వెబ్‌ల్యాండ్‌ ఆధారంగా అర్హులైన భూ యజమానుల ఖాతాల్లో మొదటి విడతగా మే నెలలో రూ.7,500లు, రెండో విడతగా అక్టోబర్‌లో రూ.4వేలు, జనవరిలో రూ.2వేల చొప్పున జమ చేస్తున్నారు

ఎలాంటి భూమి లేని ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలురైతు కుటుంబాలతో పాటు దేవదాయ, అటవీ, వక్ఫ్‌ తదితర ప్రభుత్వ భూములను సాగుచేస్తున్న రైతు కుటుంబాలకు ఈ పెట్టుబడి సాయం అందిస్తోంది.

వెబ్ ల్యాండ్ రికార్డుల ఆధారంగా అర్హులైన రైతులను ప్రభుత్వం రైతు భరోసా పథకానికి ఎంపిక చేస్తోంది. అర్హులైన రైతులు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వన్ బి, పట్టాదార్ పాస్ పుస్తకానికి సంబంధించిన జిరాక్స్ కాపీలను రైతు భరోసా కేంద్రంలో సమర్పించాల్సి ఆన్ లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

రైతు భరోసా పథకంలో భాగంగా 2019-20లో 46,69,375 మంది రైతులకు రూ.6,173కోట్లు.. 2020-21లో 51,59,045 మందికి రూ.6,928 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది.

కాగా ప్రభుత్వం భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులతో పాటు దేవదాయ, RoFR, ఇతర ప్రభుత్వ భూములు సాగుచేస్తున్న వారికి కూడా ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తోంది. ఇలాంటి వారు తొలి ఏడాదిలో 1,58,123 మంది, రెండో ఏడాది 1,54,171 మంది రైతు భరోసా కింద లబ్ధిపొందారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :