Thursday, April 8, 2021

SBI Insurance: ఎస్‌బీఐ కస్టమర్లకు రూ.20 లక్షల వరకు ఇన్స్యూరెన్స్-ఏ కార్డుపై ఎంతంటే



Read also:

SBI Insurance: ఎస్‌బీఐ కస్టమర్లకు రూ.20 లక్షల వరకు ఇన్స్యూరెన్స్... ఏ కార్డుపై ఎంతంటే

డెబిట్ కార్డులపై యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ సదుపాయం ఉందన్న విషయం చాలామందికి తెలియదు. దాదాపు ప్రతీ డెబిట్ కార్డుపైన ఈ ఇన్స్యూరెన్స్ ఉంటుంది. అయితే ఇన్స్యూరెన్స్ ఎంత ఉంటుందన్నది డెబిట్ కార్డు టైప్ పైన ఆధారపడి ఉంటుంది. వేర్వేరు కార్డులకు వేర్వురుగా ఇన్స్యూరెన్స్ మొత్తం ఉంటుంది. డెబిట్ కార్డు ఉపయోగిస్తున్నవారికి మాత్రమే ఈ ఇన్స్యూరెన్స్ లభిస్తుంది. అంటే డెబిట్ కార్డ్ ఉంటే సరిపోదు. ఆ కార్డును ఏటీఎం, పీఓఎస్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో గత 90 రోజుల్లో వాడాలన్న నిబంధన ఉంటుంది. అంటే ఇన్స్యూరెన్స్ యాక్టీవ్‌గా ఉండాలంటే డెబిట్ కార్డును తరచూ వాడుతూ ఉండాలి.


డెబిట్ కార్డుపై రెండు రకాల ఇన్స్యూరెన్స్‌లు ఉంటాయి. పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ (డెత్) నాన్ ఎయిర్ అందులో ఒకటి. అంటే నాన్ ఎయిర్ యాక్సిడెంటల్ డెత్ మాత్రమే కవర్ అవుతుంది. ఇక పర్సనల్ ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ (డెత్) మరొకటి. ఇందులో ఎయిర్ యాక్సిడెంటల్ డెత్ మాత్రమే కవర్ అవుతుంది. మరి ఏ డెబిట్ కార్డుపై ఎంత వరకు ఇన్స్యూరెన్స్ ఉంటుందో ఆ వివరాలు ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. మరి ఏ కార్డుపై ఎంత ఇన్స్యూరెన్స్ వర్తిస్తుందో తెలుసుకోండి.

SBI Gold (MasterCard/VISA): పర్సనల్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ కవర్ నాన్ ఎయిర్ (డెత్) రూ.2,00,000. పర్సనల్ ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ (డెత్) రూ.4,00,000.

SBI Platinum (MasterCard/VISA): పర్సనల్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ కవర్ నాన్ ఎయిర్ (డెత్) రూ.5,00,000. పర్సనల్ ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ (డెత్) రూ.10,00,000.

SBI Pride (Business Debit) MasterCard/VISA: పర్సనల్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ కవర్ నాన్ ఎయిర్ (డెత్) రూ.2,00,000. పర్సనల్ ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ (డెత్) రూ.4,00,000.

SBI Premium (Business Debit) MasterCard/VISA: పర్సనల్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ కవర్ నాన్ ఎయిర్ (డెత్) రూ.5,00,000. పర్సనల్ ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ (డెత్) రూ.10,00,000.

SBI VISA Signature/MasterCard Debit Card: పర్సనల్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ కవర్ నాన్ ఎయిర్ (డెత్) రూ.10,00,000. పర్సనల్ ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ (డెత్) రూ.20,00,000.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI జారీ చేసిన రూపే డెబిట్ కార్డులకు కూడా ఇన్స్యూరెన్స్ ఉంటుంది. యాక్సిడెంటల్ డెత్ లేదా టోటల్ డిసేబిలిటీ మాత్రమే కవర్ అవుతుంది.

SBI RuPay Platinum Debit Card: ఎస్‌బీఐ రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డు ఉన్నవారికి యాక్సిడెంటల్ డెత్ లేదా టోటల్ డిసేబిలిటీ రూ.2,00,000 కవరేజీ లభిస్తుంది. అయితే యాక్సిడెంట్ అయిన 45 రోజుల ముందు డెబిట్ కార్డ్ వాడి ఉండాలి.

ఇక ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఎస్‌బీఐ డెబిట్ కార్డులకు రూ.2,00,000 వరకు బీమా వర్తిస్తుంది. 2018 ఆగస్ట్ 28 కన్నా ముందు తీసుకున్నవారికి రూ.1,00,000 వర్తిస్తే, 2018 ఆగస్ట్ 28 తర్వాత డెబిట్ కార్డ్ తీసుకున్నవారికి రూ.2,00,000 బీమా వర్తిస్తుంది. యాక్సిడెంట్ జరిగిన 90 రోజుల ముందు ఆ కార్డుతో ట్రాన్సాక్షన్ చేసి ఉండాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :