Monday, March 15, 2021

SBI stop cheque payment process



Read also:

SBI stop cheque payment process

SBI stop cheque: మీరు SBI ఖాతాదారులా.చెక్ పేమెంట్ ఆపేందుకు మార్గాలివే
చెక్కు జారీ చేసిన తర్వాత లేదా వివిధ కారణాల చెక్కును రద్దు చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి అనే సందేహం అందరిలో వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఎస్బీఐ లో ఆన్ లైన్, ఆఫ్ లైన్ మార్గాల ద్వారా చెక్కును ఎలా నిలిపివేయాచ్చో లేదా రద్దు చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్యాంక్ చెక్ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. విపులంగా చెప్పాలంటే చెక్ అంటే ఓ వ్యక్తికి లేదా ఖాతాకు కొంత మొత్తాన్ని చెల్లించమని బ్యాంకుకు ఇచ్చే రాతపూర్వక ఉత్తర్వు. ఇది కేవలం చెక్ అనుసంధానమైన సంబంధిత బ్యాంకు ఖాతాదారుడి సంతకంతో మాత్రమే చెల్లుతుంది. వివిధ ప్రయోజనాల కోసం చెక్కులను జారీ చేస్తారు. కానీ చాలా మంది లావాదేవీల్లో భాగంగా వీటిని వినియోగిస్తారు. మీరు ఎవరికైతే చెక్కును జారీ చేయదలిచారో.వారి పేరుతో పాటు ఇవ్వాల్సిన సొమ్మును అక్షర, సంఖ్యా రూపంలో రాసి సంతకంతో పాటు తేదీని జతపరచాల్సి ఉంటుంది. అప్పుడు నిర్ధిష్ట తేదీన ఎదుటి వ్యక్తులు ఆ చెక్కులను జమ చేసుకోగలరు. మీ సంతకం లేకుండా ఖాళీ చెక్కును ఇస్తే ఎలాంటి రిస్క్ ఉండదు. ఖాతాదారుడి, పేరు, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సీ కోడ్, ఎంఐసీఆర్ కోడ్ లాంటి సమాచారం లాంటివి చెక్కుపై ఉంటాయి. ఇది రుజువుగా పనిచేస్తుంది. ఈ బ్లాంక్ చెక్ కంపెనీ ప్రయోజనాల కోసం అవసరం కావచ్చు. చెక్కు జారీ చేసిన తర్వాత లేదా వివిధ కారణాల చెక్కును రద్దు చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి అనే సందేహం అందరిలో వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఎస్బీఐ లో ఆన్ లైన్, ఆఫ్ లైన్ మార్గాల ద్వారా చెక్కును ఎలా నిలిపివేయాచ్చో లేదా రద్దు చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎస్బీఐ యోనో యాప్ ఉపయోగించి చెక్ పేమేంట్ ఎలా ఆపాలి?
  • ముందుగా ఎస్బీఐ యోనో యాప్ లో మీ ఆధారాలు ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
  • అనంతరం రిక్వెస్ట్స్ అనే బటన్ పై క్లిక్ చేయాలి.
  • చెక్ బుక్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
  • తర్వాత స్టాప్ చెక్ లేదా రీవోక్ స్టాప్ చెక్ ఇన్ స్ట్రక్షన్ అనే బటన్ పై క్లిక్ చేయాలి.
  • అకౌంట్ నెంబరును ఎంచుకోవాలి.
  • అనంతరం స్టాప్ చేయాల్సిన చెక్ కు సంబంధించి వివరాలను పూరించాలి. (గమనిక: ప్రారంభ చెక్ నెంబర్, ఎండ్ చెక్ నెంబర్ ఖాళీల్లో వివరాలు పొందుపరచాలి. అనంతరం సాధారణ చెక్, మల్టీ సిటీ చెక్కుల్లో ఎదోకటి ఎంచుకోవాలి. అనంతరం చెక్ నిలిపివేసేందుకు గల కారణాన్ని ఎంచుకోవాలి. పొరపాట్లు , దొంగతనం, పెయిన్ ఇన్ క్యాష్, లాస్ట్ ఇన్ మెయిల్, చెక్ రీఇష్యూడ్ తదితర కారణాలు ఇక్కడ ఉంటాయి.)
  • సబ్మిట్ బటన్ పై క్లిక్ చేసుకోవాలి. ఒక్కసారి సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత మీకు ఎస్బీ చెక్ పేమెంట్ నిలిపివేసిన కన్ఫర్మేషన్ వస్తుంది.

ఎస్బీఐ యోనో యాప్ ను ఉపయోగించిన చెక్ పేమెంట్ ఉపసంహరించుకోవడం
  • ముందుగా యోనో అప్లికేషన్ లో లాగిన్ అవ్వాలి.
  • రిక్వెస్ట్స్ బటన్ పై క్లిక్ చేయాలి.
  • చెక్ బుక్ ఆప్షన్ ను ఎంచుకోవాలి
  • రివోక్ స్టాప్ చెక్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • అకౌంట్ నెంబరుపై క్లిక్ చేయాలి
  • చెక్ వివరాలు నమోదు చేసిన తర్వాత వివరాల తనిఖీ చేయండి
  • సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. అనంతరం మీకు ఎస్బీఐ చెక్కును ఉపసంహరించుకున్నట్లు మీకు నిర్ధారణ వస్తుంది.

ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఎస్బీఐ చెక్ పేమెంట్ ఎలా ఆపాలి?
  • ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా చెక్ చెల్లింపును నిలిపివేయడానికి మొదట మీ బ్యాంకులో నమోదు చేసుకోవాలి. ఇందు కోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ కలిగి ఉండాలి.
  • ముందుగా onlinesbi.com వెబ్ పోర్టల్ ను సందర్శించండి.
  • వ్యక్తిగత బ్యాంకింగ్ కింద లాగిన్ అవ్వండి
  • హోంపేజీలో రిక్వెస్ట్ మరియు ఎంక్వైరీలపై క్లిక్ చేయాలి.
  • అనంతరం కిందకు వచ్చి స్టాప్ పేమెంట్ పై నొక్కాలి
  • చెక్ నెంబరు, తేదీ, పేరు లాంటి వివరాలను నమోదు చేయాలి.
  • అనంతరం నిబంధనలు, షరతులు చిహ్నాన్ని టిక్ చేయండి
  • తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.

ఆఫ్ లైన్ లో ఎస్బీఐ చెక్ పేమెంట్ ఎలా నిలపాలి?
ముందుగా ఖాతాదారుడు సంబంధించి బ్యాంకు బ్రాంచ్ కార్యాలయాన్ని సందర్శించడం ద్వారా చెక్ చెల్లింపును ఆపవచ్చు. కేటాయించిన వ్యక్తికి రాతపూర్వక అభ్యర్థన తర్వాత నిర్దిష్ట చెక్కుల చెల్లింపు నిలిపివేయపడుతుంది. ఈ ప్రక్రియలో ఖాతాదారుడిపై కొన్ని ఛార్జీలు వసూలు చేస్తుంది బ్యాంకు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :