Sunday, March 7, 2021

Honey vs Jaggery: తేనె వర్సెస్ బెల్లం బరువు తగ్గడానికి ఏది బెటర్



Read also:

Honey vs Jaggery: ప్రకృతి ప్రసాదించిన పదార్థాల్లో తేనె ఒకటి. సకల ఔషధ గుణాలున్న తేనె ఆరోగ్యానకి ఎన్నో ప్రయోజనాలు చేకూర్చుతుంది. బెల్లం కూడా తక్కువ తినలేదు. ఇందులో ఇనుము ఎక్కువగా ఉంటుంది. ఇది మన బాడీకి ఎంతో అవసరం. మరి ఈ రెండింటిలో ఏది తీసుకుంటే బరువు తగ్గుతారు.

Honey vs Jaggery

బరువును తగ్గించడానికి (weight loss) ఎన్నో మార్గాలున్నాయి. ఇందుకోసం చాలామంది వాకింగ్, జాగింగ్, జిమ్, ఈత, ఏరోబిక్స్ వంటివి చేస్తారు. అంత టైం లేని వాళ్లు ఇంట్లోనే ఏదో మమ అనిపించేస్తారు. ఆ మాత్రం సమయం కూడా దొరకని బిజీ బిజీ పౌరులు.. ఉదయాన్నే లేవగానే ఒక నిమ్మకాయను వేడి నీళ్లలో కలుపుకుని.. దానిలో కాసింత తేనెను కలిపి తాగుతారు.. మరి తేనె తాగడం వల్ల బరువు తగ్గుతారా?

చక్కెరకు బదులుగా తీసుకునే దానిలో తేనె మొదటిస్థానంలో ఉంటుంది. చక్కెరలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. దీనిని ఎక్కువగా తీసుకుంటే లేని పోని రోగాలు కొనితెచ్చుకున్నట్టే. అందుకే చాలా మంది షుగర్ కు ప్రత్యామ్నాయంగా తేనె ను తీసుకుంటారు.

సకల ఔషధ గుణాలున్న తేనె.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్.. గుండె, చర్మ ఆరోగ్యానికి ఎంతో కృషి చేస్తాయి.

చాలా మంది బరువు తగ్గడం కోసం ఏ పద్దతిలోనైనా తేనె ఉండేలా చూసుకుంటారు. అంతేగాక మాములు వేడి నీటిలో తేనె కలుపుకుని తాగినా ఫలితం కనబడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇక బెల్లం విషయానికొస్తే.. ఇందులో ఇనుము అధికంగా ఉంటుంది. బెల్లం తరుచూ తింటే రక్తం పెరుగుతుంది. పోషకాల విలువలు అధికంగా ఉన్న బెల్లాన్ని మన కిచెన్ లో భాగం చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

ఇది జలుబు, దగ్గు, మలబద్దకాన్ని నివారిస్తుంది. అంతేగాక బెల్లం తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఎర్ర రక్తకణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం గానీ.రాత్రి గానీ ఆహారంలో ఒక బెల్లం ముక్క కలిపి తింటే మంచిదని వైద్య నిపుణులే సూచిస్తున్నారు.

శరీర నొప్పులను తగ్గించడంలో బెల్లం ఎంతో ఉపయోగకారి. బెల్లం, నల్ల నువ్వులతో చేసిన లడ్డులను తింటే చలికాలంలో ఉబ్బసం సమస్య ఉండదు. అంతేగాక మహిళలలో రుతుక్రమం సమస్యలను నివారించడానికి కూడా ఇది చక్కని పరిష్కారం.

మరి ఏది బెస్ట్? బెల్లం, తేనె రెండు చక్కెరకు ప్రత్యామ్నాయంగా వాడేవే. బరువు తగ్గడానికి సంబంధించి ఇవి రెండింటిలో దేనిని ఎంపిక చేసుకోవడమనేది కొంచెం క్లిష్టమైన ప్రశ్నే. కానీ మార్కెట్లలో దొరుకుతున్న తేనె, బెల్లం తో ఉపయోగాల సంగతి అటుంచితే కొత్త ప్రమాదాలు కూడా వస్తున్నాయి. అయితే.. బరువు తగ్గే విషయంలో మాత్రం తేనెతో పోలిస్తే బెల్లానికే మొగ్గు చూపుతున్నాయి అధ్యయనాలు. మార్కెట్లో ప్రాసెస్ చేయని.స్వచ్ఛమైన తేనె దొరికితే మాత్రం దానిని తీసుకోవడమే ఉత్తమం. ఎందుకంటే.మార్కెట్లలో లభ్యమవుతున్న తేనె అసలైన తేనె కాదని.అది ఉట్టి చక్కెర ద్రావణమేనని తేలింది. ఈ రకంగా చూసుకుంటే మాత్రం తేనె కంటే బెల్లమే ఉత్తమ ఎంపిక.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :