Tuesday, March 9, 2021

health benefits of mint



Read also:

 Health benefits of mint: ఆరోగ్యానికి ఔషధాల సంజీవని పుదీనా.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు

Mint Benefits: పుదీనాను. ఔషధాల సంజీవనిగా పేర్కొంటారు. పుదీనాతో ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతారు. సంవత్సరం పొడువునా లభించే పుదీనాతో ఎన్నో ఔషధాలు ఉన్నాయని. వాటి ద్వారా జబ్బులను సులభంగా నయం చేసుకోవచ్చని అందరూ చెబుతారు కానీ ఎవరూ పాటించరు. కొందరికైతే పుదీనా వల్ల ప్రయోజనాలేంటో కూడా తెలియదు. పుదీనా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పుదీనాలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కొవ్వు పదార్థాలూ తక్కువే. విటమిన్ ఏ, విటమిన్ సి, డీ, బీ కాంప్లెక్స్ విటమిన్లు ఈ ఆకుల్లో దండిగా ఉంటాయి. ఇవి చర్మానికి మేలు నచేస్తాయి. అధిక ఐరన్, పొటాషియం, మాంగనీస్ వంటి వాటివల్ల రక్తంలో హీమోగ్లోబిన్ పెరిగడంతోపాటు. మెదడు పనితీరు బాగా మెరుగవుతుంది.

జీర్ణక్రియ.

పుదీనాలో ఉంటే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. దీంతోపాటు జీర్ణవ్యవస్థ ప్రక్రియ కూడా మెరగవుతుంది.

ఆస్తమా

పుదీనాను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆస్తమాని అదుపులో పెట్టవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే మితంగా తీసుకోవాలని. లేకపోతే అనార్థాలు కూడా వచ్చే అవకాశముందని సూచిస్తున్నారు.

తలనొప్పి.

పుదీనాలో ఉండే మెంథాల్ తలనొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు మీ నుదుటిపై పుదీనా రసంతో మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు.

ఒత్తిడి.

పుదీనా సువాసన వల్ల ఒత్తిడి దూరం అవుతుందని పరిశోధనలో తేలింది. అరోమా థెరపీలో కూడా పుదీనాని వాడతారు. మెదడులో కార్టిసాల్ స్థాయిని నియంత్రించి విశ్రాంతినివ్వడంతో పుదీనా సహకరిస్తుంది.

బరువు.

పుదీనాలో ఉండే ఆమ్లాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. జీర్ణక్రియని మెరుగు పర్చడం వల్ల సహజసిద్ధంగా బరువు తగ్గవచ్చని పరిశోధనలో తేలింది.

కావున ప్రతిరోజూ మన ఆహారంలో పుదీనాను చేర్చుకుంటే.అద్భుత ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఆహారంతో పుదీనా జ్యూస్, పచ్చడి, పుదీనా టీ లాంటివి చేసుకుని తింటే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :