Thursday, March 4, 2021

EPF Interest Rates 2020-21



Read also:

EPF Interest Rates 2020-21 | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును ప్రకటించింది. పూర్తి వివరాలు ఇవే.

1. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ హోల్డర్లకు గుడ్ న్యూస్. ఈపీఎఫ్ఓ 2020-21 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును నిర్ణయించింది. ఈ రోజు జరిగిన సమావేశంలో వడ్డీ రేటుపై నిర్ణయం తీసుకుంది.

2. ఈపీఎఫ్ ఖాతాదారులకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి 8.50 శాతం వడ్డీ చెల్లించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. గురువారం జరిగిన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు.

3. గత ఆర్థిక సంవత్సరంలో అంటే 2019-20 లో కూడా ఈపీఎఫ్ఓ 8.5 శాతం వడ్డీనే చెల్లించిన సంగతి తెలిసిందే. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే రేటు ప్రకారం వడ్డీ ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది.

4. ఈపీఎఫ్ ఖాతాదారులకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి 8.50 శాతం లభిస్తుంది. అయితే ఈ వడ్డీ చెల్లింపు ఎప్పుడు అనేదానిపై తుది నిర్ణయం తీసుకోనుంది ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్.

5. ఓసారి ఈపీఎఫ్ వడ్డీ రేట్ల చరిత్ర చూస్తే 2012-13 ఆర్థిక సంవత్సరంలో 8.50 శాతం, 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరాల్లో 8.75 శాతం, 2015-16 లో 8.80 శాతం, 2016-17 లో 8.65 శాతం వడ్డీ ఉండేది. కానీ 2017-18 సంవత్సరంలో 8.55 శాతానికి వడ్డీని తగ్గించారు.

6. ఆ తర్వాత 2018-19 ఆర్థిక సంవత్సరంలో వడ్డీని 8.65 శాతానికి పెంచడం కోట్లాది ఈపీఎఫ్ ఖాతాదారులకు మేలు చేసింది. కానీ ఆ తర్వాత 2019-20 లో వడ్డీ రేటును 8.50 శాతానికి తగ్గించారు. ఇప్పుడు 2020-21 ఆర్థిక సంవత్సరానికి 8.50 శాతం వడ్డీని ఇవ్వనుంది ఈపీఎఫ్ఓ.

7. వాస్తవానికి ఈసారి వడ్డీ రేటు తగ్గించొచ్చు అన్న వార్తలు వచ్చాయి. దీంతో వడ్డీ 8.50 శాతం కన్నా తగ్గొచ్చని అనుకన్నారు. కానీ వడ్డీ రేటులో మార్పు చేయకుండా ఈపీఎఫ్ ఖాతాదారులకు ఊరటనిచ్చింది బోర్డు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :