Monday, March 8, 2021

EPF: ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స వివరాలు



Read also:

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ అనేది జీతం ఉన్న వ్యక్తుల కోసం ప్రభుత్వ యాజమాన్యం తో నడిచే పెన్షన్ ప్లాన్. దీంతో ప్రతి నెల 12 శాతం బేసిక్ పే మరియు డియర్ నెస్ అలవెన్స్ చేయడం జరుగుతుంది. యూనియన్ బడ్జెట్ 2021 ఆర్థిక మంత్రి నిర్మల సీతా రామన్ ఈపీఎఫ్ లో టాక్స్ లిమిటేషన్ కోసం చెప్పడం జరిగింది. అయితే కొత్త రూల్ ప్రకారం ప్రావిడెంట్ ఫండ్ కింద రూపాయలు 2.5 లక్షలు ప్రతి సంవత్సరం ఉంచితే ఎటువంటి వడ్డీ పడదు. అదే రూపాయలు 2.5 లక్షలు దాటితే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

అయితే కేవలం 2.5 లక్షల వరకు మాత్రమే ఇది పన్ను చెల్లించకుండా ఉంచడానికి వీలవుతుంది. అయితే ఇలా మార్చడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే..?

ఆదాయ లోటు అని అన్నారు. ఫౌండర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ క్లియర్ టాక్స్ Archit Gupta కూడా ఇదే విషయాన్ని చెప్పారు.

ప్రావిడెంట్ ఫండ్ మీద వచ్చే వడ్డీ పై పన్ను మినహాయింపు ఇవ్వడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉంది అందుకే ఈ కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎంప్లాయి కాంట్రిబ్యూషన్ ని బట్టి పన్ను ఉంటుంది. రూపాయలు 20.83 సంవత్సరం ఆదాయం ఉన్న వాళ్ళను ఉద్దేశించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఇలా ఉండేది కాదు కానీ ఇక నుంచి ఇది వర్తిస్తుంది. April 1, 2021 నుండి ఈ కొత్త రూల్స్ అమలు లోకి రానున్నాయి. వాలంటరీ ప్రోవిడెంట్ ఫండ్ పై కూడా ఎఫెక్ట్ చూపనుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :