Wednesday, March 3, 2021

AP EAMCET-2021 Exam Dates Released



Read also:

AP EAMCET-2021 Exam Dates Released-ఏపీ ఎంసెట్‌-2021 షెడ్యూల్‌ విడుదల - పరీక్ష తేదీల వివరాలు.

ఎంసెట్‌ నిర్వహణ బాధ్యతలను జేఎన్‌టీయూ కాకినాడకు అప్పగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. ఐసెట్‌, లాసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈసెట్‌ తదితర ఇతర ప్రవేశ పరీక్షల తేదీలపై త్వరలో స్పష్టత రానుంది. 

  • జులై 12-15 వరకు ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలు
  • జులై 19,20 తేదీల్లో ఎంసెట్‌ బైపీసీ స్ట్రీమ్‌ పరీక్షలు 

ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను, కన్వీనర్లను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈ క్రమంలో ఎంసెట్ 2021 పరీక్షపై కూడా స్పష్టత ఇచ్చింది. ఎంసెట్ ఇంజనీరింగ్‌ విభాగం పరీక్షలు జులై 12 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు. మొత్తం 8 విడతలుగా ఇంజినీరింగ్‌ పరీక్ష నిర్వహించనున్నారు.  

బైపీసీ విభాగానికి సంబంధించిన పరీక్షను జులై 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు నాలుగు విడతలుగా నిర్వహించనున్నారు. ఎంసెట్‌ నిర్వహణ బాధ్యతలను జేఎన్‌టీయూ కాకినాడకు అప్పగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. 

ఈ ఏడాది విద్యా సంవత్సరం ఆలస్యమైనందున డిగ్రీ విద్యార్థులకు ఆగస్టు 6 వరకు క్లాసులు నిర్వహించనున్నారు. అనంతరం సెమిస్టర్‌ పరీక్షలు ఉంటాయి. ఈ నేపథ్యంలో డిగ్రీ పరీక్షల షెడ్యూల్‌ను అనుసరించి ఐసెట్‌, లాసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈసెట్‌ తదితర ఇతర ప్రవేశ పరీక్షలను ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబరు మొదటి వారంలో నిర్వహించనున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :