Monday, March 22, 2021

25న ఎపి క్యాబినేట్ మీటింగ్



Read also:

25న ఎపి క్యాబినేట్ మీటింగ్

అమరావతి, : ఈ ఆర్థిక సంవత్సరం చివరి మంత్రిమండలి సమావేశం ఈ నెల 25 వతేదీ జరిగనున్నట్లు- సమాచారం. సమావేశ తేదీ నిర్ణయంపై సోమవారం నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ప్రధానంగా కీలక బిల్లులకు మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది. ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు లేకపోవడంతో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. అదే విధంగా మున్సిపాలిటీ-లు, కార్పొరేషన్లలో డిప్యూటీ- మేయర్లు, వైస్‌ చైర్మన్‌ల పెంపు దలకు సంబంధించిన బిల్లుతో పాటు-, రాష్ట్రంలో హెచ్‌ఆర్సీ ఏర్పాటు-, అలాగే వాహనాల కాలుష్య నివారణకు సంబంధించిన కీలకమైన బిల్లులకు ఆమోదముద్ర పడనుంది. గత కేబినెట్‌ పంచాయతీ ఎన్నికల అనంతరం జరుగగా ఈసారి పురపాలక ఎన్నికల అనంతరం జరగడం గమనార్హం.

ఈ సమావేశంలో ప్రధానంగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమం, పోలవరం ప్రాజెక్టు తదితర విషయాలపై చర్చించనున్నారు. అదే విధంగా రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ రోజు రోజుకు విజృంభిస్తున్న నేపద్యంలో తీసుకోవాల్సిన నివారణ చర్యలు, వాక్సినేషన్‌పై కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ నెలాఖరుకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో నూతన ఎస్‌ఈసీ నియామకంకు సంభందించి ప్రస్తావించనున్నారు. అదే విధంగా ఏప్రిల్‌ నెలలో జరుగనున్న తిరుపతి ఎన్నికలు, విశాఖలో పాలనా రాజధాని, కర్నూలు లో న్యాయ రాజధాని ఏర్పాటు-, అమరావతి రాజధాని భూముల వ్యవహారం తదితర అంశాలపై కూడా మంత్రి మండలిలో ప్రస్తావనకు రానున్నాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :