Tuesday, March 16, 2021

ఏప్రిల్ 1 నుంచి బ్యాంక్ రూల్స్ ఛేంజ్



Read also:

వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం 8 ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని విలీనం చేసి 3 బ్యాంకులుగా మార్చిన నేపథ్యంలో పాత బ్యాంకులకు సంబంధించిన పాస్ బుక్కులు, చెక్ బుక్కులు ఏప్రిల్ 1 నుంచి పనిచేయవనే విషయం వినియోగదారులు గుర్తించాలి.

విజయాబ్యాంక్, దేనా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంకులకు చెందిన వినియోగదారులు.. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తమ పాస్ బుక్‌లు, చెక్‌బుక్కులతో పాటు ఐఎఫ్‌ఎస్‌సీ, ఎంఐసీఆర్ కోడ్ వంటివి కూడా మారతాయి. విలీనం చేసిన బ్యాంకుల కస్టమర్లు తమ మొబైల్ నెంబర్, చిరునామా, నామినీ మొదలైన వివరాలను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

అయితే సిండికేట్ బ్యాంక్ ఖాతాదారుల ప్రస్తుత చెక్ బుక్స్ 2021 జూన్ 30 వరకు చెల్లుబాటు అవుతాయని బ్యాంకు ప్రకటించింది. మారిన బ్యాంకుల్లో వినియోగదారులు వారి వారి సమాచారాన్ని అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

అంతేకాకుండా పన్ను విషయంలో కొన్ని మార్పులు రానున్నాయి. ఏప్రిల్ 1 తర్వాత 75 ఏళ్ల వయసు పైబడిన వారు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు. పెన్షన్ ద్వారా, ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వడ్డీ ద్వారా ఆదాయాన్ని పొందుతున్న వారికి ఇది వర్తిస్తుంది.

ఇక ఉద్యోగస్తులకు ఏప్రిల్ 1 నుంచి కొ్త్త వేతన కోడ్ అమలులోకి రానుంది. ఈ కోడ్ ద్వారా బేసిక్ పే పెంచనున్నారు. దీంతో బేసిక్ పే పెరిగితే అందులో 12 శాతం పీఎఫ్ అకౌంట్‌లో జమ చేయాల్సి ఉంటుంది. పీఎఫ్ పెరిగితే చేతికి వచ్చే శాలరీ తగ్గుతుందని గుర్తించాలి. వీటితో పాటు ఏప్రిల్ 1 నుంచి ఇన్స్యూరెన్స్ ప్రీమియం రేట్లు కూడా పెరగనున్నాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :