Wednesday, March 17, 2021

ఏపీ, తెలంగాణ స్కూళ్లల్లో కరోనా కలకలం-ఏకంగా 104 మంది విద్యార్థులకు కొవిడ్



Read also:

ఏపీ, తెలంగాణ స్కూళ్లల్లో కరోనా కలకలం.. ఏకంగా 104 మంది విద్యార్థులకు కొవిడ్

హైదరాబాద్‌ (‌చట్టం) : తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం ఆందోళనకు గురి చేస్తుంది. స్కూల్‌ ‌ప్రారంభించడానికి ముందు ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్లలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కూల్లు నడుస్తున్నాయా అన్న ప్రశ్న ఉందయిస్తోంది.  తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే స్కూళ్లు ప్రారంభమయ్యాయి. పిల్లలు బడి బాట పట్టారు. బుద్ధిగా చదువుకుంటున్నారు. పిల్లలు మళ్లీ పుస్తకాలు పట్టుకోవడంతో తల్లిదండ్రులు కూడా కొంత హ్యాపీగా ఫీలయ్యారు. అంతా ఓకే అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా అలజడి రేగింది. తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లలో కరోనా మహమ్మారి కలకలం రేపింది. పలు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. వందలాది మంది విద్యార్థులకు కరోనా సోకిందనే వార్త అటు తల్లిదండ్రులను, ఇటు ప్రభుత్వాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో స్కూళ్లు ఎంతవరకు సేఫ్ అనే సందేహం వ్యక్తమవుతోంది. తల్లిదండ్రుల్లో మళ్లీ భయాందోళన మొదలైంది.

తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రోజులుగా మళ్లీ కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. రోజూ 150కి పైగా కేసులు బయటపడుతున్నాయి. దీంతో మళ్లీ అలజడి రేగింది. ప్రజల్లో ఆందోళన మొదలైంది. కాగా, ఆందోళనకు గురి చేసే మరో అంశం ఏంటంటే.. రాష్ట్రంలో స్కూల్స్ పై కొవిడ్‌ ప్రతాపం చూపుతోంది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు స్కూల్స్ లో ఏకంగా 104 మంది స్టూడెంట్స్ కు కరోనా సోకడం తల్లిదండ్రులను కలవరానికి గురి చేసింది. ఇక కరోనా సోకిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. చదువుకోవడానికి పంపిస్తే కరోనా తచ్చుకున్నారని వాపోతున్నారు. కరోనా సోకిన విద్యార్థుల తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు.

36 మంది మైనార్టీ గురుకుల విద్యార్థినులకు కరోనా:

తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 36 మంది విద్యార్థులకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. మేడ్చల్‌ జిల్లా బాలానగర్‌ మండలానికి చెందిన మైనార్టీ గురుకుల పాఠశాల నాగోలు బండ్లగూడలోని ఆనంద్‌ చౌరస్తాలో ఉంది. ఇక్కడ 165 మంది ఉంటున్నారు. వారిలో 25 మంది విద్యార్థులకు ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు చేయగా 18 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే అలర్ట్ అయిన అధికారులు మిగిలిన విద్యార్థులు, 19 మంది సిబ్బందికి కూడా పరీక్షలు నిర్వహించారు. వీరిలో మరో 18 మంది విద్యార్థులకూ కరోనా ఉన్నట్లు తేలింది. వారందరినీ భవనంలోని 5వ అంతస్తులో ఐసొలేషన్‌కు తరలించారు. నెగెటివ్‌ వచ్చిన విద్యార్థులను తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లిపోయారు.

విద్యార్థులకు కరోనా ఎలా సోకిందో

స్కూల్ లోకి ఎవరికీ అనుమతి లేకున్నా విద్యార్థులకు కరోనా ఎలా సోకిందనే విషయం అంతుచిక్కడం లేదు. కేవలం రెండు రోజుల నుంచే విద్యార్థుల్లో కొందరికి ఒంటి నొప్పులు, నీరసం వచ్చినట్లు ప్రిన్సిపాల్‌ వినీల తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున స్కూల్‌ కి చేరుకొని నెగెటివ్‌ వచ్చిన విద్యార్థులను ప్రిన్సిపాల్‌ అనుమతితో ఇళ్లకు తీసుకెళ్లారు.

న్యూ బోయిన్‌పల్లి బాపూజీనగర్‌లోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ వసతి గృహంలో ముగ్గురు విద్యార్థులు కరోనా బారినపడ్డ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంచిర్యాలలోని బాలికల పాఠశాలలో మంగళవారం(మార్చి 16,2021) కరోనా కేసుల సంఖ్య 28గా తేలింది. ఆరోగ్యశాఖ ప్రత్యేక వైద్య శిబిరంలో 174 మందికి పరీక్షలు నిర్వహించగా 34 పాజిటివ్‌గా తేలాయి. ఇందులో 28 మంది విద్యార్థినులు.. ఆరుగురు తల్లిదండ్రులు ఈ నేపథ్యంలో ఆ పాఠశాలకు మూడు రోజులు సెలవు ప్రకటించారు. బెల్లంపల్లిలో ఓ టీచర్, చెన్నూరులో ఓ టీచర్ కరోనా బారినపడ్డారు.  కామారెడ్డి సమీప కస్తూర్బా విద్యాలయంలో 32 మంది విద్యార్థినులకు కరోనా సోకినట్లు నిర్ధారించారు. కరీంనగర్‌ నగరం సప్తగిరి కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ఐదుగురు విద్యార్థులు, ఒక టీచర్ కి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

ఏపీలోనూ క్రమంగా కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. మరో పక్క స్కూళ్లలోనూ కొవిడ్ కలవరం రేపుతోంది. కర్నూలు జిల్లా పత్తికొండలో ఓ ప్రైవేట్ స్కూల్ లో ఆరో తరగతి చదివే ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో స్కూల్ యాజమాన్యం అలర్ట్ అయ్యింది. ముందు జాగ్రత్తగా స్కూల్ ని మూసేశారు. ఈ బడిలో 400 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. తిరుమల ధర్మగిరిలోని వేద పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు, నలుగురు అధ్యాపకులు కరోనా బారిన పడ్డారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :