Wednesday, February 24, 2021

Rice Health Benefits



Read also:

Rice Health Benefits: బియ్యంతో మీరు నమ్మలేని 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ప్రపంచ జనాభాలో దాదాపు సగం జనాభా ప్రధాన ఆహారం బియ్యం. దీనితో కేవలం అన్నమే కాదు. రకరకాల వంటకాలు చేసుకొని తినడం చాలా దేశాల్లో కామన్ . ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా దేశాల్లో వరి సాగు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి వాతావరణ పరిస్థితులు, ప్రజల ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజల ఆహారంలో ఇవి భాగమయ్యాయి. దీని శాస్త్రీయ నామం ఒరైజా సటైవాగా పిలుస్తారు. అయితే, మార్కెట్లో బ్లాక్ రైస్, రెడ్ రైస్, బ్రౌన్ రైస్, వైల్డ్ రైస్, వైట్ రైస్ వంటి అనేక రకాల బియ్యం అందుబాటులో ఉన్నాయి. అయితే, తెలుపు రంగులో ఉండే బియ్యం కంటే గోధుమ రంగులోని బియ్యం మంచివనే ప్రచారం ఉంది. ఇందులో నిజం లేదని, వాస్తవానికి బియ్యం ఏ రంగులో ఉన్నా అవి ఆరోగ్యానికి మంచివేనని నిపుణులు చెబుతున్నారు. రైస్‌తో ఎన్నో రకాల వంటలు చేసి ఆరగించడంతో పాటు ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు అంటున్నారు. కాగా, ప్రాసెస్ చేసిన రైస్ కంటే ప్రాసెస్ చేయని రైస్ ఆరోగ్యానికి చాలా మంచిదని సూచిస్తున్నారు.

రైస్ వండటం చాలా సులభం, ఎక్కువ సమయం కూడా పట్టదు. బియ్యంతో తయారుచేసిన ఆహారపదార్థాలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఏదైనా సరే అతి అనర్థానికి దారి తీస్తుంది. రైస్ విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. రోజూ మితంగానే రైస్ తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

శక్తికి మూలం:

అలసట, ఆకలి తీవ్రంగా ఉన్న సందర్భంలో కొద్దిగా అన్నం తిన్నా తీసుకుంటే తక్షిణ శక్తి లభిస్తుంది. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు శక్తిగా మారి మన శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. ఇది మీ శరీరాన్ని శక్తివంతంగా ఉంచడమే కాక, అలసట లేకుండా మీ మెదడును సమర్థంగా పనిచేసేలా చేస్తుంది.

జీర్ణక్రియకు బూస్ట్:

రైస్ మీ జీర్ణవ్యవస్థను మెరుగుపర్చి, మీకు ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది. దీన్ని అరిగించుకోవడం సులభం. తేలిగ్గా అరుగుతూ జీర్ణ వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. రైస్ లో ఎక్కువగా ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది మన శరీరంలోని మలినాలను తొలగించడంతో పాటు డీహైడ్రేషన్ ని నివారిస్తుంది.

ఊబకాయానికి చెక్:

ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడంలో రైస్ బాగా తోడ్పడుతుంది. ఇందులో తక్కువ స్థాయిలో ఉండే సోడియం, కొలెస్ట్రాల్ బరువు పెరగడాన్ని నిరోధిస్తాయి. అన్నం తగిన మోతాదులో తింటే అది బరువుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదు. రైస్ లో ఉండే ఫైబర్ ఒబెసిటీని నియంత్రిస్తుంది.

గుండెకు ఎంతో మేలు:

రైస్ వాడకం గుండెకు మేలు చేస్తుంది. ఇందులో ఉండే వాపును నివారించే గుణాలతో పాటు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆరోగ్యకరమైన గుండెకు రైస్ బ్రాన్ ఆయిల్ ఎంతో మంచిది. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. అంతేకాక, రైస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.

రక్తపోటు, మధుమేహానికి చెక్

అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడేవారికి రైస్ సరైన ఆహారం. రైస్ తీసుకోవడం ద్వారా రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రించవచ్చు. ఈ రెండూ జీవనశైలి వ్యాధులతో ఇబ్బందిపడేవారు ఒక బౌల్ రైస్ తో వీటిని ధీటుగా ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :