Friday, February 19, 2021

PRC పై త్వరలో నివేదిక ఉద్యోగుల సమస్యలు చిత్తశుద్ధితో పరిష్కారం -సీఎస్ ఆదిత్యనాథ్



Read also:

  • పీఆర్సీపై త్వరలో నివేదిక
  • సీఎస్ తో ఉద్యోగ సంఘాల భేటీ
  • పాలనలో ఉద్యోగుల పాత్ర కీలకం
  • అమ్మఒడి పథకం అందరికీ వర్తింపు
  • ఉద్యోగుల సమస్యలు చిత్తశుద్ధితో పరిష్కారం-సీఎస్ ఆదిత్యనాథ్

అమరావతి, ఆంధ్రప్రభ : పాలనలో ఉద్యోగుల పాత్ర కీలకమని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభు త్వం చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, సచివా లయంలో గురువారం నిర్వహించారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగులు కృషి ఎంతో ఉందన్నారు. కరోనా కష్టకా లంలోనూ ప్రభుత్వంతో ఉద్యోగులు కలిసి పనిచేశారని కొనియాడారు నాన్ ఫైనాన్స్ సమస్యలను సంబంధిత శాఖలతో మాట్లాడి తక్షణమే పరిష్కారిస్తామన్నారు. అమ్మ ఒడి పథకాన్ని అందరికీ వర్తింపజేస్తామని, విద్యార్థుల తల్లులు నిరుత్సహ పడొద్దని సీఎం ఆదిత్యనాథ్ దాస్ భరోసా ఇచ్చారు పీఆర్సీపై త్వరలో రిపోర్టు అందజేస్తామన్నారు. ఉద్యోగుల సమస్యలపై జాయింట్ కౌన్సిల్ కమిటీ సమావేశం ఏప్రిల్ లో నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, విద్యావ్యవస్థలో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఉద్యోగులను సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబ సభ్యుల్లా భావిస్తారన్నారు. మరో సలహాదారు జీవీడీ కృష్ణమోహన్ మాట్లాడుతూ, ఉద్యోగులు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఇప్పటికే సీపీఎస్, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలర్ చేయడంపై కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. అంతకుముందు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు...తమ సమస్యలను సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడీ కృష్ణమోహన్ కు విన్నవించారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :