Thursday, February 11, 2021

Interviews for guest lecturer jobs in those government degree colleges



Read also:

Interviews for guest lecturer jobs in those government degree colleges

Telangana Jobs: ఇప్పుడిప్పుడే ప్రభుత్వాల అనుమతితో పాఠశాలలు, కాలేజీలు కొద్ది మేర ప్రారంభం అవుతుండడంతో ప్రైవేటు ఉపాధ్యాయులు, లెక్చరర్లకు మళ్లీ ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Interviews for guest lecturer jobs in those government degree colleges

కరోనా ఎఫెక్ట్ తో అనేక మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారు. ఈ మాయదారి మహమ్మారి దెబ్బకు ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బందులు పడ్డ వారిలో ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, కాలేజీల లెక్చరర్లు ఉన్నారు. అయితే ఇప్పుడిప్పుడే ప్రభుత్వాల అనుమతితో పాఠశాలలు, కాలేజీలు కొద్ది మేర ప్రారంభం అవుతుండడంతో ప్రైవేటు ఉపాధ్యాయులు, లెక్చరర్లకు మళ్లీ ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని మెదక్ ప్రభుత్వ డిగ్ర కళాశాల, నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పలు సబ్జెక్టులు బోధించడానికి అర్హత కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని మెదక్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ హెచ్ఎం నరసింహం ఓ ప్రకటన విడుదల చేశారు. మెదక్ లోని డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్/అప్లికేషన్స్, ఆంగ్లము, హిస్టరీ, మాథ్స్, పొలిటికల్ సైన్స్, స్టాటిస్టిక్స్, తెలుగు సబ్జెక్టులను బోధించడానికి అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

నర్సాపూర్ లోని డిగ్రీ కాలేజీలో కామర్స్, కంప్యూటర్ సైన్స్/అప్లికేషన్స్, హిస్టరీ, తెలుగులో ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. ఆయా సబ్జెక్టుల్లో 55 శాతం మార్కులతో పీజీ(ఎస్సీ, ఎస్టీలకు 50శాతం)తో పాటు NET/SLET/Ph.D కలిగి ఉండాలన్నారు. Ph.D అర్హత కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన వారు పూర్తి బయోడేటాతో సర్టిఫికెట్ల జీరాక్స్ కాపీలతో జత చేసిన దరఖాస్తులను ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, మెదక్ లోని కామర్స్ విభాగంలో ఫిబ్రవరి 12వ తేదీ సాయంత్రం 4 గంటలలోగా ఆ విభాగాధిపతికి అందాంచాలని ప్రిన్సిపాల్ సూచించారు.

అనుభవానికి సంబంధించిన ధ్రువపత్రాన్ని దరఖాస్తుతో పాటు జత చేయాలని ప్రకటనలో సూచించారు. ఈ నియామకాలకు సంబంధించిన ఇంటర్వ్యూ, డెమో, ఎంపిక ప్రక్రియ ఫిబ్రవరి 13వ తేదీ శనివారం 11 గంటలకు ఉంటుందని ప్రకనటలో తెలిపారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే వారు ఒరిజినల్ సర్టిఫికేట్లను వెంట తీసుకురావాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులు ఈ విద్యా సంవత్సరం చివరి వరకు పని చేయాలని ప్రిన్సిపాల్ తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ నరసింహం సూచించారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :