Friday, February 19, 2021

గ్రామ పంచాయతిలకి కొత్త నిబంధనలు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం



Read also:

గ్రామ పంచాయతిలకి కొత్త నిబంధనలు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

పంచాయతీ ఎన్నికలు ముగిసిన అనంతరం ఏపీ ప్రభుత్వం కొత్త నియమనిబంధనలను విడుదల చేసింది. అవి ఏంటంటే...


1) నీటి/ ఇంటి పన్నులు వచ్చేటివి , వచ్చినవి ప్రతి నెల నోటీసు బోర్డు పై చూపాలి.

2) ప్రతి నెల వీధి లైట్స్చెక్ చేసి, లైట్స్ వేయాలి,ఎన్ని వేసారో నోటీసు బోర్డు పై చూపాలి.

3) ప్రతి నెల కొత్త పింఛన్లు ఎవరికీ రావాలో వాళ్ళకు ఇప్పించాలి.

4) ప్రతి నెల లో ఒకసారి మరుగుదొడ్లను వాడడం మరియు చెత్తను చెత్త కుండీలో వేయడం లాంటివి ప్రోగ్రామ్స్ ను చేపట్టాలి.

5) ఏదైన పండుగలు వస్తే వాటికీ ఐన ఖర్చులు నోటీసు బోర్డు లో చూపించాలి.

6) గవర్నమెంట్ ఫండ్స్ వస్తే ఎంత వచ్చాయో,ఎంత ఖర్చు చేసారో నోటీసు బొర్ఢ్ లో చూపాలి.

7) ప్రతి నెల గ్రామసభ నిర్వచించాలి.గ్రామసభలో 100మందికి పైగా ఉన్న ఫొటో సంభదిత అధికారికి పంపాలి. ప్రజలకు గ్రామంలో ఏమి అవసరమో తెలుసుకొని వాటిని నిర్వచించాలి.

8) ప్రతి ఇంటికి మరుగు దొడ్డి లేని యెడల కొత్త మరుగు దొడ్డి ని కట్టించాలి. ఇంతక ముందు కట్టినా వారికి డబ్బులు రాణించి వాటికి డబ్బులు ఇప్పించాలి..

9)గ్రామంలో మరియు ప్రతి ఇంటికి ఆవరణలో రెండు చెట్లు ను నాటించాలి.

10) రేషన్ షాప్ లో బియ్యం ఎన్ని వస్తున్నాయి ,ఎన్ని పోతున్నాయి తెలుసుకోవాలి. బయటి సరుకులు రేషన్ షాప్ లో ఆమ్మరాదు.

11)ప్రతి గ్రామంలో ప్రతి మనిషికి 132.00 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది ఉదాహరణకు గ్రామంలో 6000 మంది ప్రజలు ఉన్నారు అనుకోండి.8,00000(ఎనిమిది లక్షల రూపాయలు)గవర్నమెంట్ గ్రామపంచాయతీ లకు ఇస్తుంది.ప్రతి నెల గ్రామ పంచాయతీ ఈ ఎనిమిది లక్షల రూపాయలు దేనికి ఉపయోగిస్తున్నారో గ్రామసభలో అడగవచ్చు.

ఈ పదకొండు పాయింట్లలో ఏదైనా లోపం జరిగిన ఆ పదవి నుండి తొలిగించే అధికారం ప్రజలకు ఉన్నది.

ప్రజలారా గుర్తు ఉంచుకోండి ఏదైనా అన్యాయం జరిగినట్లయితే పైఅధికారికి తెలపండి.

11)వ పాయింట్ చాలా ముఖ్యమైనది ప్రభుత్వం నుండి వచ్చిన నగదు ఎంత? పంచాయితీ అభివృద్ధి కార్యక్రమాలకు పెట్టిన ఖర్చు ఎంత??గ్రామ పంచాయతీలో జరిగే ప్రతిదీ తెలుసుకొని

గ్రామ అభివృద్ధికి తోడ్పదాం.వ్యవస్థ లో మార్పు రావాలి అంటే ప్రతి ఒక్కరు ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలి.ప్రశ్నించడం ఒక సామాజిక బాధ్యత.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :