Friday, February 26, 2021

జూన్‌ నుంచి దేశ జన గణన



Read also:

జూన్‌ నుంచి దేశ జన గణన

కరోనా విజృంభణ కారణంగా వాయిదా పడ్డ ‘జన గణన’ ఈ ఏడాది జూన్‌ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ బృహత్తర ప్రక్రియను జూన్‌లో ప్రారంభించి, వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. అదే సమయంలో జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌)లో తాజా వివరాలనూ పొందుపర్చనున్నట్లు చెప్పారు. కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, పోలీసులు, ఇతర సిబ్బందితోపాటు వృద్ధులకు (మొత్తంగా దాదాపు 30 కోట్ల మందికి) టీకా అందించాల్సి ఉండటంతో జన గణన ఇప్పట్లో మొదలయ్యే అవకాశాల్లేవని తొలుత విశ్లేషణలు వెలువడ్డాయి. వ్యాక్సినేషన్‌ జూన్‌కు ముందే పూర్తవుతుందని తాము అంచనా వేస్తున్నట్లు అధికారి చెప్పారు. ఆలోపు నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోనూ అసెంబ్లీ ఎన్నికలు పూర్తవుతాయని పేర్కొన్నారు. ఈ దఫా జనాభా లెక్కలను డిజిటల్‌ విధానంలో చేపట్టనున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :