Tuesday, January 26, 2021

e-EPIC కార్డు సంబందించిన సమాచారం



Read also:

ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రానిక్ ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ e-EPIC అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే మీ ఓటర్ ఐడీ కార్డును డిజిటల్ కార్డు రూపంలో డౌన్‌లోడ్ చేయొచ్చు.
👉ఫిబ్రవరి 1 నుంచి డిజిటల్ ఓటర్ ఐడీ కార్డును డౌన్‌లోడ్ చేయొచ్చు. ఈ డిజిటల్ ఓటర్ ఐడీ చూపించి ఎన్నికల్లో ఓటు కూడా వేయొచ్చు. అంటే ఓటర్ ఐడీ కార్డు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.
ఎలక్ట్రానిక్ ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ e-EPIC అంటే డిజిటల్ ఓటర్ ఐడీకి సంబంధించి ఓటర్లలో అనేక సందేహాలు ఉన్నాయి. ఈ 12 ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోండి.

1. E-EPIC అంటే ఏంటీ?
e-EPIC ఐడీ పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ల్యామినేట్ కూడా చేయొచ్చు. డిజీలాకర్‌లో అప్‌లోడ్ చేయొచ్చు. ప్రస్తుతం జారీ చేస్తున్న పీవీసీ ఓటర్ ఐడీ కార్డుకు అదనంగా e-EPIC సర్వీస్ ప్రారంభమైంది.

2. E-EPIC ఎలా డౌన్‌లోడ్ చేయాలి?
ఓటర్ పోర్టల్ http://voterportal.eci.gov.in/ లేదా ఓటర్ హెల్ప్‌లైన్ మొబైల్ యాప్ లేదా నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ https://www.nvsp.in/ లో డౌన్‌లోడ్ చేయొచ్చు.

3. E-EPIC ఎవరు తీసుకోవచ్చు?
కొత్తగా ఓటర్‌గా నమోదు చేసుకున్నవారు ఎవరైనా e-EPIC డౌన్‌లోడ్ చేయొచ్చు. స్పెషల్ సమ్మరీ రివిజన్ 2021 అంటే 2020 నవంబర్, డిసెంబర్‌లో అప్లై చేసినవారు e-EPIC డౌన్‌లోడ్ చేయొచ్చు. ఇక ఇతర ఓటర్లు 2021 ఫిబ్రవరి 1 నుంచి e-EPIC డౌన్‌లోడ్ చేయొచ్చు.

4. ఓటర్ ఐడీ నెంబర్ తెలియకపోయినా E-EPIC ఎలా డౌన్‌లోడ్ చేయాలి?
http://voterportal.eci.gov.in/ లేదా http://electoralsearch.in/ పోర్టల్స్‌లో మీ పేరు సెర్చ్ చేసి e-EPIC డౌన్‌లోడ్ చేయొచ్చు.

5. ఫామ్ 6 రిఫరెన్స్ నెంబర్‌తో E-EPIC డౌన్‌లోడ్ చేయొచ్చా?
అవును. ఫామ్ 6 రిఫరెన్స్ నెంబర్ ఉపయోగించి e-EPIC డౌన్‌లోడ్ చేసే అవకాశం కల్పిస్తోంది ఎన్నికల కమిషన్.

6. E-EPIC ఫైల్ సైజ్ ఎంత?
కేవలం 250 కేబీ మాత్రమే.

7. E-EPIC ప్రింట్ తీసుకొని పోలింగ్ స్టేషన్‌లో చూపించొచ్చా?
e-EPIC డౌన్‌లోడ్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని పోలింగ్ స్టేషన్‌లో చూపించొచ్చు.

8. E-EPIC ఎలా డౌన్‌లోడ్ చేయాలి?
http://voterportal.eci.gov.in/ లేదా https://nvsp.in/ లేదా Voter Helpline Mobile App ప్లాట్‌ఫామ్స్ ద్వారా e-EPIC డౌన్‌లోడ్ చేయొచ్చు. లాగిన్ అయిన తర్వాత Download e-EPIC పైన క్లిక్ చేయాలి. EPIC నెంబర్ లేదా ఫామ్ రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి e-EPIC డౌన్‌లోడ్ చేయాలి. మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేయకపోతే e-KYC పూర్తి చేయాలి.

9. E-KYC అంటే ఏంటీ?
మీ ఫోటో క్యాప్చర్ చేసి EPIC డేటాతో కంపేర్ చేస్తారు.

10. E-KYC ఫెయిల్ అయితే?
ఈఆర్‌ఓ ఆఫీసుకు వెళ్లి ఫోటో ఐడీ ప్రూఫ్ సబ్మిట్ చేసి, మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయాలి.

11. E-KYC చేయాలంటే ఏం కావాలి?
మొబైల్ ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లో ఏదైనా ఒకటి ఉంటే చాలి. కెమెరా లేదా వెబ్‌క్యామ్ తప్పనిసరి.

12. మొబైల్ నెంబర్ అప్‌డేట్ లేకపోతే?
e-KYC ద్వారా మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయాలి. e-KYC పూర్తైన తర్వాతే డౌన్‌లోడ్ చేయొచ్చు. కుటుంబ సభ్యులందరూ ఒకే మొబైల్ నెంబర్ ఉపయోగించొచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :