Thursday, January 21, 2021

Appeals on teacher transfers from today



Read also:

  • నేటి నుంచి ఉపాధ్యాయ బదిలీలపై అప్పీళ్లు
  • అప్పిలేట్ అథారిటీగా ఆర్జేడీ  కి బాధ్యతలు
  • ఈ నెల 30 వరకు డీఈఓ కార్యాలయంలో స్వీకరణకు ఏర్పాట్లు

ఉపాధ్యాయ బదిలీల్లో తమకు నష్టం జరిగిందని భావించిన ఉపాధ్యాయుల నుంచి అప్పీళ్లను స్వీకరించేందుకు ఉద్దేశించిన ప్రక్రియ గురువారం ప్రారంభం కానుంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయ ఆదేశాలతో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాల యంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఉపా ధ్యాయ బదిలీల ప్రక్రియలో భాగంగా ఆన్లైన్ లో దరఖా స్తులు సమర్పించి, వెబ్ ఆధారిత ఆప్షన్లు నమోదు చేసుకుని సంక్రాంతి సెలవుల్లో బదిలీ ఆర్డర్లు పొందిన ఉపాధ్యాయులకు అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కల్పిం చారు. బదిలీలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో 54లో అప్పీల్ చేసుకునే వెసులుబాటునిచ్చారు. బది లీల్లో నష్టపోయామని భావించిన ఉపాధ్యాయులు గురు వారం నుంచి ఈ నెల 30 వరకు అప్పిలేట్ అథారిటీ అయిన పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ కె.రవీంద్రనాథ్ రెడ్డికి లిఖిత పూర్వకంగా అప్పీల్ చేయాలి. ఆర్జేడీకి అడ్రస్ చేస్తూ ఉపాధ్యాయులు తాము సొంతంగా రాసిన లేఖను డీఈఓకార్యాలయంలో అందజేయాలి.

అప్పీల్ చేసేందుకు ఎవరు అర్హులంటే?

బదిలీల ప్రక్రియలో భాగంగా జిల్లాలో 2,921 మంది ఉపాధ్యాయులు స్థాన చలనం పొందారు. వీరిలో ఒకే పాఠశాలలో పని చేస్తూ ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసు కున్న 1,567 మంది ఎస్టీటీలతో పాటు వివిధ కేటగిరీలకు చెందిన 632 మంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు అదే విధంగా రిక్వెస్ట్ బదిలీ కోరుకున్న వారిలో మరో 722 మంది ఉన్నారు

ఉపాధ్యాయులకు సంబంధించిన సీనియార్టీ, వివిధ కేటగిరీల కింద ప్రాధాన్యత క్రమంలో పొందిన పాయింట్లు ఆధారంగా బదిలీల్లో తాము కోరుకున్న పాఠశాలలకు బదిలీపై వెళ్లిన వారి గురించి అప్పీల్ చేసుకోవచ్చు రేషనలైజేషన్లో అన్యాయం జరిగిందని భావించినా, లేక అర్హత లేనివారికిఅర్బన్ ప్రాంతాలకు దగ్గరగా పాఠశాలలను కేటాయించారని సమాచారం ఉన్న ఉపాధ్యాయులు తగిన ధ్రువప త్రాలతో అప్పీల్ చేసుకునే వీలుంది

స్పౌజ్ కేటగిరీలో ఉన్న ఉపాధ్యాయులు ప్రాధాన్యత క్రమంలో పాయింట్లు పొందినప్పటికీ, అందుకు విరుద్ధం గా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకుని బదిలీ పొందిన పక్షం లో సరైన ఆధారాలతో వాటిని అధికారుల దృష్టికి తీసుకు రావచ్చు

డీఈవో కార్యాలయంలో సమర్పించిన అప్పీల్స్ పై విచా రణ జరిపే అధికారులు వాటికి రిమార్కులను రాసి ఆర్జేడీకి పంపుతారు. వాటిని పరిశీలించిన ఆర్టేడీ వాటిని సరిదిద్దేం దుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కు పంపుతారు. అర్హత లేని ఉపాధ్యాయులు ప్రాధాన్యత క్రమంలో బదిలీ పొందిన పక్షంలో వారి బదిలీని నిలుపుదల చేసి అర్హులైన ఉపా ధ్యాయులకు న్యాయం చేసే అవకాశాలు ఉన్నాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :