Tuesday, December 1, 2020

seniority list will release today



Read also:

షెడ్యూల్ ప్రకారం నిన్ననే ప్రకటించాల్సి ఉంది

సీనియారిటీ జాబితాలు ఈ రోజు విడుదల

అంతర్జాలం లో అందుబాటు

దరఖాస్తుల స్వీకరణ ముగింపు మినహా ఏదీ షెడ్యూల్ ప్రకారం జరగడం లేదు: ఉపాధ్యాయులు

వెబ్ కౌన్సెలింగ్ డెమో వాయిదా

షెడ్యూల్ ప్రకారం నిన్ననే ప్రకటించాల్సిన ఉపాధ్యాయుల బదిలీల సీనియారిటీ జాబితాలు ఈ రోజు నుండి అంతర్జాలం లో అందుబాటు లోకి రానున్నాయి. బదిలీల వెబ్సైట్ https://teacherinfo.ap.gov.in/  లో ఈ సీనియారిటీ జాబితాలు అందుబాటు లో ఉంచుతారు. సాంకేతిక కారణాలు తలెత్తితే జాబితాల విడుదల రేపటికి వాయిదా పడుతుంది. సీనియారిటీ జాబితాల ను రూపొందించే కార్యక్రమం కూడా బదిలీల సాఫ్ట్ వేర్ చేస్తుంది. ఇప్పటికే డిఈఓ లకు సీనియారిటీ జాబితాలను రూపొందించే ఆప్షన్ కూడా ఇచ్చారు. అయితే నిన్న సీనియారిటీ జాబితాలు విడుదల కాక పోవడం తో ఆశక్తి గా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులు ఒకింత నిరాశ కు గురి అయ్యారు. దరఖాస్తుల స్వీకరణ ముగింపు మినహా ఏదీ షెడ్యూల్ ప్రకారం జరగడం లేదు అని ఉపాధ్యాయులు వాపోతున్నారు. షెడ్యూల్ ప్రకారం బదిలీలు నిర్వహించాలి అని కోరుతున్నారు. అటు వెబ్ కౌన్సెలింగ్ మీద ఉపాధ్యాయ సంఘాలకు నిన్న నిర్వహించాల్సిన డెమో సైతం వాయిదా పడింది. ఈ మేరకు అధికారులు ఉపాధ్యాయ సంఘాలకు సమాచారం పంపారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :