Wednesday, December 9, 2020

PPF Deposits



Read also:

PPF Deposits | మీరు పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేశారా? మెచ్యూరిటీ తర్వాత మీకు మూడు ఆప్షన్స్ ఉంటాయి. ఏ ఆప్షన్ ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఒకప్పుడు ఆరోగ్య భీమా(Health insurance) గురించి ఎక్కువ మంది ఆలోచించేవారు కాదు. కానీ, కోవిడ్–19(Covid) నేపథ్యంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం ఆరోగ్య భీమా కలిగి ఉండటం తప్పనిసరిగా భావిస్తున్నారు. ముఖ్యంగా, కరోనా చికిత్సకు భారీ ఖర్చు వెచ్చించాల్సి వస్తుండటంతో ప్రజలు ఆరోగ్య భీమా పాలసీలను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పెరుగుతున్న ఆరోగ్య ఖర్చులు, కొన్ని భీమా పాలసీలు కరోనా చికిత్సకు చెల్లుబాటు కావడం లేదన్న ఫిర్యాదుల దృష్ట్యా ప్రజలు వ్యక్తిగత ఆరోగ్య పాలసీలవైపు మొగ్గుచూపుతున్నారని హెల్త్ సెక్టార్ నిపుణులు అంటున్నారు. ఉద్యోగులు తమ సంస్థ అందించే ఎంప్లాయర్ హెల్త్ పాలసీ(employer health policy)ని కలిగి ఉన్నప్పటికీ, వ్యక్తిగత హెల్త్ పాలసీని కూడా తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

సాధారణంగా యాజమాన్యం(employer) అందించే ఆరోగ్య భీమా పాలసీతో, కుటుంబానికి అవసరమైన మొత్తం హెల్త్ కవరేజీ(coverage) సరిపోదు. అదనపు కవరేజ్ అవసరం ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా, వ్యక్తిగత ఆరోగ్య పాలసీ(personal health policy) ఉద్యోగం కోల్పోయినప్పుడు లేదా ఉద్యోగి ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినప్పడు కూడా ఈ పాలసీ సహాయపడుతుంది.

గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలోనే ఫాస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్..

అయితే, వ్యక్తిగత, యాజమాన్య పాలసీలు రెండూ కలిగి ఉన్న సందర్భంలో పాలసీదారుడు(policyholder) మొదట ఏ పాలసీని ఉపయోగించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా, బేసిక్ హెల్త్ కవరేజీ(basic coverage)లను గ్రూప్ ఇన్సూరెన్స్ ప్లాన్స్, వ్యక్తిగత ఇన్సూరెన్స్ ప్లాన్స్(individual plan) రెండూ అందజేస్తాయి. అయితే, గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ(group plan)లు తక్కువ ఖర్చుతో కూడుకున్నవి కాగా, వ్యక్తిగత ఇన్సూరెన్స్ మెరుగైన కవరేజీని అందిస్తాయి. అందువల్ల, క్లెయిమ్(claim) చేసుకునేటప్పుడు ఏ పాలసీని ఎంచుకోవాలి అనేది మీ కవరేజీని బట్టి నిర్ణయం తీసుకోండి.

అయితే, గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీదారుడు పాలసీ క్లెయిమ్ చేసుకున్నప్పటికీ ప్రీమియం మొత్తంలో ఎటువంటి పెరుగుదల ఉండదు. అంతేకాక, గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీల క్లెయిమ్ ప్రక్రియ చాలా వేగంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తిగత పాలసీలతో పోల్చినప్పుడు గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీల నిబంధనలు మరింత సరళంగా ఉంటాయి. అందువల్ల, మొదటి క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం గ్రూప్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం ఉత్తమం.

అదే వ్యక్తిగత పాలసీ విషయానికి వస్తే పాలసీ క్లెయిమ్ చేసిన తర్వాత ప్రీమియం రెనివల్కి ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఏదేమైనా, క్లెయిమ్ కోసం ఏ పాలసీని ఎంచుకోవాలి అనే విషయంలో ప్రస్తుత అవసరాలను, భవిష్యత్తు అవసరాలను, రిస్క్ ఫ్యాక్టర్(risk factor)ను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :