Tuesday, December 1, 2020

Employees Deposit Linked Insurance Scheme



Read also:

మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఈపీఎఫ్ అకౌంట్‌హోల్డర్లకు వచ్చే లాభాలపై మీకు అవగాహన ఉందా? ఈవిషయం తెలుసుకోకపోతే మీరు ఇన్స్యూరెన్స్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్-EDLI స్కీమ్‌ తెలుసుకోండి.

1. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO నిర్వహించే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్-EDLI స్కీమ్‌కు అర్హులు. అంటే ఈపీఎఫ్ అకౌంట్ ఉంటే చాలు ఈడీఎల్ఐ స్కీమ్‌కు అర్హత సాధించినట్టైతే.

2. అసలేంటీ ఈడీఎల్ఐ స్కీమ్? ఈ స్కీమ్ గురించి తెలిసినవారు తక్కువే. ఇది బీమా పథకం. అంటే ఈపీఎఫ్ ఖాతాదారులందరికీ ఈపీఎఫ్ఓ అందించే బీమా ప్రయోజనం. ఇటీవల ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్-EDLI స్కీమ్‌లో కొన్ని సవరణలు చేసింది ఈపీఎఫ్ఓ.

3. ఎక్కువ మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు ఈ ఇన్స్యూరెన్స్ లాభాలు అందించేందుకు ఈపీఎఫ్ఓ అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు. ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్ చనిపోవడానికి ముందు 12 నెలల కాలంలో ఒకటి కన్నా ఎక్కువ సంస్థల్లో పనిచేసి సర్వీసులో మరణించినట్టైతే వారి కుటుంబ సభ్యులకు కూడా బీమా ప్రయోజనం కల్పించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. 

4. గతంలో అయితే ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్ చనిపోవడానికి ముందు 12 నెలల కాలంలో ఒకటి కన్నా ఎక్కువ సంస్థల్లో పనిచేసినట్టైతే ఇన్స్యూరెన్స్ బెనిఫిట్ లభించేది కాదు. వారికి కూడా బీమా కల్పించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నిర్ణయం తీసుకుంది. 

5. ఈ స్కీమ్ ద్వారా రూ.2.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఉచితంగా బీమా పొందొచ్చు. ఈపీఎఫ్ ఖాతాదారులు సర్వీసులో ఉండగా మరణిస్తే నామినీకి ఈ బీమా మొత్తం లభిస్తుంది.

6. ఈడీఎల్ఐ స్కీమ్ నెలకు బేసిక్ సాలరీ రూ.15,000 లోపు ఉన్న వారందరికీ వర్తిస్తుంది. బేసిక్ సాలరీ రూ.15,000 దాటితే గరిష్టంగా రూ.6 లక్షల వరకే బీమా ఉంటుంది. అంటే చివరి 12 నెలల్లో ఉన్న బేసిక్ వేతనానికి 30 రెట్లు+రూ.1,50,000 బోనస్ ఇస్తారు.

7. ఉదాహరణకు బేసిక్ సాలరీ రూ.15,000 అయితే రూ.15,000x30= రూ.4,50,000 అవుతుంది. రూ.4,50,000+రూ.1,50,000 బోనస్‌తో కలిపి గరిష్టంగా రూ.6,00,000 మాత్రమే లభిస్తుంది.

8. ఈడీఎల్ఐ స్కీమ్‌లో చేరడానికి ఉద్యోగులు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంప్లాయర్ మాత్రం బేసిక్ సాలరీలో 0.5% లేదా గరిష్టంగా రూ.75 ప్రతీ నెల చెల్లించాలి. 

9. ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్ సర్వీసులో చనిపోతే నామినీ ఈ బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందుకోసం చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికెట్, ఫామ్ 5 ఐఎఫ్, నామినీ అకౌంట్‌కు చెందిన క్యాన్సల్డ్ చెక్ కావాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :