Wednesday, December 16, 2020

ఎసిడిటీ సమస్య వేదిస్తోందా ఈ చిట్కాలు ప్రయత్నించి చూడండి



Read also:

ఎసిడిటీ ఎంతగా బాధిస్తుందనేది. దాన్ని అనుభవించేవారికే తెలుస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే. ఈ కింది చిట్కాలు పాటించండి.

ఎసిడిటీ. మనుషులను ప్రశాంతంగా ఉండనివ్వదు. ఏం తినాలన్నా. ఏం జరుగుతుందనే భయం బాధితులను వెంటాడుతుంది. పుల్లటి తేన్పులు. ఛాతిలో మంట. గొంతులో ఏదో అడ్డుపడినట్లు నిండుగా ఉండటం ఇంకా ఎన్నో లక్షణాలు ఎసిడిటీ బాధితులను ఇబ్బందిపెడతాయి. మరి, ఈ సమస్యకు పరిష్కారం ఉందా? ఏం చేస్తే ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందవచ్చు? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అయితే, ఎసిడిటీ సమస్యను పూర్తిగా తొలగించలేమనే చేదు విషయాన్ని మీరు తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి. కానీ, ఆహారం విషయం జాగ్రత్తలు పాటిస్తూ.ఈ చిట్కాలను ప్రయత్నిస్తే. తప్పకుండా మీకు ఉపశమనం లభిస్తుంది.

❂ ఊరగాయలు, చట్నీలు, వెనిగర్ వంటివి ఎంత తక్కువ తింటే అంత మంచిది.

❂ రోజు ఉదయాన్నే పరగడపున పుదీనా ఆకులు నమలండి.

❂ భోజనం తర్వాత పుదీనా ఆకుల రసాన్ని తీసుకోండి.

❂ భోజనం తర్వాత లవంగాలను బుగ్గలో పెట్టుకోండి. దీనవల్ల ఎసిడిటీ సమస్య ఉండదు.

❂ లవంగాల్లో ఉండే కార్మెటివ్ గుణాలు జీర్ణాశయంలో ఆహారాన్ని త్వరగా కిందికి పంపిస్తాయి.

❂ ఎసిడిటీ ఉన్నవారు కొద్ది అల్లం తినొచ్చు. కానీ, మోతాదు మించితే మరో సమస్య వస్తుంది.

❂ ఎసిడిటీ నుంచి తక్షణ ఉపశమనం కోసం నిమ్మ, బెల్లం, పెరుగు, అరటి పండు తీసుకోవచ్చు.

❂ ఎసిడిటీ బాధితులు బీన్స్, గుమ్మడికాయ, క్యాబేజీ, వెల్లులి, క్యారెట్, మునగ కాయలు తీసుకోవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :