Tuesday, December 15, 2020

బదిలీల తర్వాతే డీఎస్సీ



Read also:

బదిలీల తర్వాతే  డీఎస్సీ

రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ పూర్తి కాగానే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకను గుణంగా ప్రభుత్వం ఇప్పటికే హేతుబద్దీకరణ ఆధారంగా ఖాళీల సంఖ్యలను జిల్లాల వారీగా సిద్దం చేస్తోంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభు త్వం ఏర్పాటైన తర్వాత ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయడంతోపాటు, ప్రతి జనవరిలో డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది వివిధ కారణాల వల్ల జనవరిలో ప్రకటించలేదు. అనంతరం కరోనా విజృంభించడంతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ సుదీర్ఘకాలంగా నిలిచిపో యింది. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల కోసం విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసి, ప్రక్రియ ప్రారంభించింది. నెలాఖరులోగా వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీ ప్రక్రియ పూర్తి చేయనుంది. 60 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండేలా రేషనలైజేషన్ నిబంధనలు రూపొందించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ ఖాళీలతోపాటుగా.. ఈ ఏడాది అడ్మిషన్లు పెరిగిన నేపథ్యంలో రేషనలైజేషన్  ప్రకారం ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

15 నుంచి 20 వేల ఖాళీలు

రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో పోస్టులను బ్లాక్ లో ఉంచుతున్నారు. దాదాపు 15 వేల పోస్టులు బ్లాక్ చేసినట్లు సమాచారం. ఈ పోస్టులన్నింటినీ త్వరలో రెగ్యులర్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్ ఇటీవల ప్రకటించారు వీటితో పాటుగా... ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత పదవీ విరమణ చేస్తున్న ఉపాధ్యాయుల పోస్టుల ఖాళీలను కలుపుకొని మెగా డీఎస్సీ వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది మొత్తం మీద 15 వేల నుంచి 20 వేలకుపైగా పోస్టులకు నోటిఫికేషన్ జనవరిలో విడుదలయ్యే అవకాశాలున్నాయి

జనవరిలోనే టెట్, డీఎస్సీ

రాష్ట్రంలో బదిలీల ప్రక్రియ నెలాఖరులోగా పూర్తవుతుండటంతో కొత్త ఏడాదిలో టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల కానున్నట్లు సమాచారం. డీఎస్సీ కోసం అభ్యర్థులు టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) అర్హత సాధించాల్సి ఉంటుంది. అందుకోసం వేలాది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. జనవరిలో టెట్ నోటిఫికేషన్ వచ్చి, పరీక్షా ప్రక్రియ పూర్తయితే మరో రెండు మూడు నెలల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయొచ్చనే అంచనాలు వ్యక్తమవతున్నాయి. అయితే ఈ విద్యా సంవత్సరం సిలబస్ మారడంతో ప్రిపరేషన్ కు వీలుగా ఉండేలా నోటిఫికేషన్ల షెడ్యూల్స్ ముందుగానే ప్రకటించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :