Wednesday, December 16, 2020

AP Anganwadi Jobs Recruitment 2020



Read also:

AP Anganwadi Jobs Recruitment 2020

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

1. అనంతపురం జిల్లాలో మొత్తం 855 పోస్టుల్ని భర్తీ చేస్తోంది మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ. అంగన్వాడీ వర్కర్, మినీ అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టులున్నాయి.

2. మొత్తం 855 ఖాళీలు ఉండగా అందులో అంగన్వాడీ వర్కర్- 132, మినీ అంగన్వాడీ వర్కర్- 67, అంగన్వాడీ హెల్పర్- 656 పోస్టులున్నాయి. 

3. మండలాల వారీగా అంగన్వాడీ వర్కర్ పోస్టుల వివరాలు ఇవే.

4. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 19 చివరి తేదీ. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.

5. విద్యార్హతల వివరాలు చూస్తే అభ్యర్థులు 10వ తరగతి పాస్ కావాలి. 2020 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుంచి 35 ఏళ్ల లోపు ఉండాలి.

6. స్థానికులు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేయాలి. అంగన్వాడీ కేంద్రం ఉన్న గ్రామస్తులై ఉండాలి.

7. వేతనాల వివరాలు చూస్తే అంగన్వాడీ వర్కర్‌కు రూ.11,500, మినీ అంగన్వాడీ వర్కర్‌కు రూ.7,000, అంగన్వాడీ హెల్పర్‌కు రూ.7,000 లభిస్తుంది.

8. దరఖాస్తు ఫామ్ https://ananthapuramu.ap.gov.in/ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసి, పూర్తి చేసి మెయిల్ ద్వారా పంపాలి. వేర్వేరు మండలాలకు వేర్వేరు మెయిల్ ఐడీలు ఉన్నాయి. మెయిల్ ఐడీల వివరాలను నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

9. అనంతపురం జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ వివరాలను https://ananthapuramu.ap.gov.in/ వెబ్‌సైట్‌‌లో తెలుసుకోవచ్చు.

Download the Notification  Download the Anganwadi form  Official website

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :