Saturday, December 26, 2020

Aadhaar SBI link



Read also:

 Aadhaar SBI link-మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉందా? మీ బ్యాంకు అకౌంట్లకు ఆధార్ నెంబర్‌ను తప్పనిసరిగా లింక్ చేయాలి. డిసెంబర్ 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కొద్ది రోజుల క్రితం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకర్లను ఆదేశించింది. మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉన్నట్టైతే ఆధార్ నెంబర్ ఎలా లింక్ చేయాలో తెలుసుకోండి.

1. మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉందా? అయితే మీరు మీ ఆధార్ నెంబర్‌ను బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేయాలి. బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయడం ప్రకారం తప్పనిసరి. ప్రభుత్వ పథకాలకు చెందిన సబ్సిడీని పొందేందుకు బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ లింక్ చేయాలని ప్రభుత్వం చాలాకాలంగా చెబుతోంది. 

2. ఇప్పటివరకు ఆధార్ నెంబర్ లింక్ చేయనివారు ఇకనైనా తమ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయాలి. బ్యాంకులు త్వరలోనే చివరి తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అకౌంట్లకు ఆధార్ నెంబర్ లింక్ చేయాలంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI చాలాకాలంగా తమ కస్టమర్లను కోరుతోంది.

3. మీరు ఇప్పటివరకు మీ ఆధార్ నెంబర్‌ను ఎస్‌బీఐ అకౌంట్‌కు లింక్ చేయకపోతే 5 పద్ధతుల ద్వారా చేయొచ్చు. ఎస్‌బీఐ వెబ్‌సైట్, ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ పోర్టల్, ఎస్‌బీఐ ఎనీవేర్ యాప్, ఎస్‌బీఐ ఏటీఎం, ఎస్‌బీఐ బ్రాంచ్‌కు వెళ్లి మీ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయొచ్చు. 

4. SBI website: ముందుగా https://www.sbi.co.in/వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. హోమ్ పేజీలో I 'Link your AADHAAR Number with your bank account' ఆప్షన్‌పైన క్లిక్ చేయండి. మీ వివరాలు ఎంటర్ చేసి రిక్వెస్ట్ సబ్మిట్ చేయండి. మీ ఎస్‌బీఐ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ అయిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు సమాచారం అందుతుంది. 

5. SBI net banking portal: ఎస్‌బీఐ నెట్‌ బ్యాంకింగ్ పోర్టల్ https://www.onlinesbi.com/ ఓపెన్ చేయండి. మీ వివరాలతో లాగిన్ కావాలి. ఆ తర్వాత 'My Accounts' ఆప్షన్‌లోకి వెళ్లిన తర్వాత 'Link your Aadhaar number' లింక్ పైన క్లిక్ చేయండి. మీ అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.

6. SBI YONO App: ఎస్‌బీఐ యోనో యాప్‌లో లాగిన్ చేసిన తర్వాత 'Requests' పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత 'Aadhaar' సెక్షన్‌లో 'Aadhaar linking' పైన క్లిక్ చేయాలి. మీ వివరాలతో పాటు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. 

7. SBI ATM: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో మీ డెబిట్ కార్డుతో స్వైప్ చేయాలి. మీ పిన్ ఎంటర్ చేసిన తర్వాత 'Service -- Registrations' క్లిక్ చేసి ఆధార్ రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేయాలి. మీ అకౌంట్ సరిచూసుకొని ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.

8. SBI branch: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌కు వెళ్లి మీ అకౌంట్‌తో ఆధార్ లింకింగ్ కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫామ్‌తో పాటు మీ ఆధార్ జిరాక్స్ కాపీ కూడా జత చేయాలి. వెరిఫికేషన్ తర్వాత మీ ఆధార్ నెంబర్ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అవుతుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు సమాచారం అందుతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :