Tuesday, November 24, 2020

Teachers info



Read also:

నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం

ప్రధాని మోదీ మంగళవారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రెండు వేర్వేరు సమావేశాలు నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 

కరోనా కేసులు అధికంగా ఉన్న 8 రాష్ట్రాల సీఎంలతో ఉదయం 10 గంటలకు మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వ్యాక్సినేషన్‌ భవిష్యత్తు కార్యాచరణపై అన్ని రాష్ట్రాల సీఎంలతో చర్చించనున్నట్లు తెలిసింది. 

వ్యాక్సినేషన్‌కు ప్రాధాన్య క్రమం గుర్తింపు, శీతలీకరణ సదుపాయాలు, మానవ వనరుల సమీకరణ లాంటి అంశాలపై సీఎంల అభిప్రాయాలు తెలుసుకొని, వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

విద్యాకానుక’ కిట్లు మార్చుకోవచ్చు

'జగనన్న విద్యా కానుక’ కిట్‌లో బూట్ల సైజు సరిపోకపోయినా, బ్యాగులు సరిగ్గా లేకపోయినా, ఇంకా ఏ వస్తువైనా నాణ్యత లేకపోయినా మార్చుకోవచ్చని సమగ్రశిక్ష ఎస్‌పీడీ కె.వెట్రిసెల్వి స్పష్టం చేశారు. 

సోమవారం నుంచి ‘జగనన్న విద్యా కానుక వారోత్సవాలు’ ప్రారంభమైన నేపథ్యంలో.. 

విజయవాడలోని కేబీసీ బాలుర ఉన్నత పాఠశాలను వెట్రిసెల్వి సందర్శించారు. కిట్లు, పుస్తకాలు అందాయో లేదో అడిగి తెలుసుకున్నారు

8వ తరగతిలో 70శాతం హాజరు : సురేశ్‌

రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం నుంచి ప్రారంభించిన 8 నుంచి 10 తరగతులకు విద్యార్థుల హాజరు బాగుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. 

8వ తరగతిలో 70, 9వ తరగతిలో 41.61, పదో తరగతిలో 46.28 శాతం విద్యార్థులు హాజరైనట్టు మీడియాకు తెలిపారు. 

రాష్ట్రంలో ఈ మూడు తరగతుల విద్యార్థులు 5,70,742 మంది ఉండగా, 3,96,809 మంది హాజరయ్యారని తెలిపారు. 

డిసెంబరు 14 తర్వాత 6, 7 తరగతులు కూడా నిర్వహిస్తామన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :