Friday, November 13, 2020

Highlights of today's meeting at the DEO office regarding teacher transfers



Read also:

Highlights of today's meeting at the DEO office regarding teacher transfers

1.బదిలీలకు ఆన్లైన్ అప్లికేషను పెట్టుకోవడానికి రిజిస్టర్ మొబైల్ కు Message రాకపోతే సంబంధిత HM, MEO,Dy.EO ల ద్వారా DEO కార్యాలయానికి వారి Treasury ID,Mobile number అందజేయాలని తెలిపారు.

2.జిల్లాలో ప్రతి ఏకోపాధ్యాయ పాఠశాలకు రెండో ఉపాధ్యాయుడిని ఇస్తారు.అయితే పిల్లల సంఖ్య బాగా తక్కువగా ఉన్నచోట నుండి ఒక ఉపాధ్యాయుడిని deputation మీద అవసరమున్న పాఠశాలకు పంపిస్తారు.

3.ఇటీవల జిల్లాలో జరిగిన ప్రమోషన్స్ లో విల్లింగ్ ఇచ్చిన టీచర్లందరూ ప్రస్తుతం బదిలీలకు అప్లికేషను పెట్టుకోవాలని ASO గారు తెలిపారు.సీనియారిటీ లిస్ట్స్,వేకెన్సీ పొజిషన్ కు ఇది అవసరమని వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.

4.ఫోర్త్ కేటగిరి లో పనిచేసిన ఉపాధ్యాయులు అప్లికేషను పెట్టుకునే సమయంలో 2012,2015,2017 బదిలీల సమయంలో DEO కార్యాలయం MEO/Dy.EO లకు అందజేసిన పాఠశాలల కేటగిరి లిస్ట్స్ ఆధారంగా వచ్చే స్టేషన్ పాయింట్స్ పొందవచ్చని తెలిపారు.2020 లో విడుదల చేసే కేటగిరి లిస్ట్ కొత్తగా బదిలీలకు దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే applicable అవుతుందని తెలిపారు.

5.2017 లో విడుదల చేసిన పాఠశాల కేటగిరిల లిస్ట్ లో తప్పులు ఉన్నట్లయితే వాటిని సరిచేయాలని కోరుతూ వచ్చే దరఖాస్తులను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళతామని తెలిపారు.

6.ఒకవేళ spouse అంగన్వాడీ టీచర్ అయితే spouse points ఇస్తారా అనే సందేహానికి ఇవ్వబడవు అని తెలియజేశారు.

7.ప్రమోషన్ వచ్చిన రెండు సంవత్సరాల లోపు రేషనలైజేషన్ కు గురి అయితే వారికి అంతకుముందున్న పాయింట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నారు.

8.ప్రతి UP SCHOOL కి పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా కనీసం ఇద్దరు SA ఉపాధ్యాయులను ఇవ్వాలని కోరాము.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :