Thursday, November 19, 2020

Air Purifier Robot



Read also:

Air Purifier Robot: గాలిని శుద్ధి చేసే రోబోను అభివృద్ధి చేసిన విద్యార్థులు

భారత్‌లోని వివిధ రాష్ట్రాల్లో వాయు కాలుష్యం పెరుగుతోందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కాలుష్య నివారణ మార్గాలతో పాటు ఎయిర్ ఫిల్టర్లపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

భారత్‌లోని వివిధ రాష్ట్రాల్లో వాయు కాలుష్యం పెరుగుతోందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కాలుష్య నివారణ మార్గాలతో పాటు ఎయిర్ ఫిల్టర్లపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా కాన్పూర్‌కు చెందిన 11వ తరగతి విద్యార్థి ఒక ప్రత్యేకమైన రోబోను అభివృద్ధి చేశాడు. ఇది వాతావరణం నుంచి కలుషితమైన గాలి కణాలను పీల్చుకుంటుంది. అనంతరం స్వచ్ఛమైన గాలిని అందిస్తూ ఎయిర్ ప్యూరిఫయర్‌గా పనిచేస్తుంది.

ఈ ఎయిర్ ప్యూరిఫయర్ రోబోను కనిపెట్టిన విద్యార్థి పేరు ప్రంజల్. తన క్లాస్‌మేట్ ఆరేంద్రతో కలిసి సరికొత్త రోబోను అభివృద్ధి చేశాడు. దీంట్లో గాలిని శుద్ధి చేసే యంత్రం ఉంటుంది. చిన్న వయసులోనే ఈ విద్యార్థులు చేసిన ప్రయత్నాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు. వాయు కాలుష్యం పెరుగుతున్నందువల్ల వాతావరణంలోని కాలుష్యాన్ని వేరుచేసి, స్వచ్ఛమైన గాలిని అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రయోగం చేశామని వారు చెబుతున్నారు. ఇందుకు ఈ డివైజ్లో ప్యూరిఫైయర్ను ఏర్పాటు చేశామని తెలిపారు.

Air_purifier_Robot

ఫిల్టర్ చేస్తుంది

ఈ రోబో కలుషితమైన గాలిని ఫిల్టర్ చేయగలదు. రోబో పనిచేసేటప్పుడు లోపల ఉన్న ఎయిర్ ఫిల్టర్‌ కలుషితమైన గాలి కణాలను పీల్చుకుంటుంది. అనంతరం స్వచ్ఛమైన గాలిని వాతావరణంలోకి విడుదల చేస్తుంది. కలుషితమైన గాలి కణాలు ఫిల్టర్‌లోనే ఉండేలా రోబోను డిజైన్ చేశామని దాని రూపకర్తలు చెబుతున్నారు.

విలువైన ప్రయోగం

ప్రాంజల్ తమ ముందు ఈ రోబోను ప్రదర్శించినప్పుడు ఆశ్చర్యపోయాయని చెబుతున్నారు పాఠశాల ప్రిన్సిపాల్ పూజా అవస్థీ. ‘ప్రాంజల్ మా భవిష్యత్తు శాస్త్రవేత్త. అతడు స్కూల్‌ ల్యాబ్‌లో కూడా ఇతరులకు సహాయం చేస్తాడు. మా విద్యార్థి సాధించిన విజయం పట్ల గర్వపడుతున్నాం. ఇటీవల వాయు కాలుష్యం పెరిగింది. ఇది ఆందోళన కలిగించే అంశం. ఇవన్నీ చూస్తే, ప్రాంజల్ ఆవిష్కరణ మరింత విలువైనదిగా అనిపిస్తుంది’ అని ఆమె వివరిస్తున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :