Friday, October 23, 2020

JioPages Web Browser



Read also:

 ఆండ్రాయిడ్ యూజర్లకు శుభవార్త. రిలయెన్స్ జియో మేడ్ ఇన్ ఇండియా బ్రౌజర్‌ను లాంఛ్ చేసింది. డేటా ప్రైవసీతో పాటు యూజర్ల సమాచారాన్ని వారి కంట్రోల్‌లో ఉండేలా అద్భుతమైన ఫీచర్స్‌తో ఈ బ్రౌజర్‌ను రూపొందించింది రిలయెన్స్ జియో. జియోపేజెస్ పేరుతో ఈ వెబ్ బ్రౌజర్‌ను రూపొందించింది. క్రోమియం బ్లింగ్ ఇంజిన్‌తో ఈ వెబ్ బ్రౌజర్ పనిచేస్తుంది. పేజ్‌ను వేగంగా లోడ్ చేయడం, సమర్థవంతంగా మీడియా స్ట్రీమింగ్ చేయడం, ఎమోజీ డొమైన్ సపోర్ట్, ఎన్‌క్రిప్టెడ్ కనెక్షన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. పర్సనలైజ్డ్ హోమ్ స్క్రీన్ ఆప్షన్ ఉంది. దీనిపై యూజర్లు గూగుల్, బింగ్, డక్ డక్ గో, యాహూ లాంటి తమకు నచ్చిన సెర్చ్ ఇంజిన్‌లను డిఫాల్ట్‌గా సెట్ చేసుకోవచ్చు. వీటితో పాటు తమకు నచ్చిన వెబ్ పేజీలను హోమ్ స్క్రీన్‌పై పిన్ చేసుకోవచ్చు. ఇందులో అడ్వాన్స్‌డ్ డౌన్‌లోడ్ మేనేజర్ ఉంది. మీరు డౌన్‌లోడ్ చేసే ఫైల్స్‌ని ఇమేజ్, వీడియో, డాక్యుమెంట్, పేజెస్ అని వేర్వేరుగా కేటగిరీ చేస్తుంది. దీని ద్వారా మీరు సులభంగా ఫైల్స్ వెతుక్కోవచ్చు. పర్సనలైజ్డ్ థీమ్ ఆప్షన్ కూడా ఉంది. డార్క్ మోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలుగు, హిందీతో పాటు కన్నడ, తమిళ్, మరాఠీ, గుజరాతీ, మళయాళం, బెంగాళీ భాషల్ని జియో బ్రౌజర్ సపోర్ట్ చేస్తుంది.


ఇక వీటితో పాటు యూజర్లు తమ భాష, టాపిక్, ప్రాంతాన్ని బట్టి పర్సనలైజ్డ్ కంటెంట్‌ని పొందొచ్చు. మీరు ఎంచుకున్న టాపిక్స్ పైనే జియోపేజెస్ నోటిఫికేషన్లు పంపుతుంది. ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్స్‌, హెడ్‌లైన్స్‌ని ఇన్ఫర్మేటీవ్ కార్డ్స్ ద్వారా చూడొచ్చు. ఈ బ్రౌజర్ స్థానిక భాషల్లో కూడా అందుబాటులో ఉంది కాబట్టి మీరు కోరుకున్న భాషలో కంటెంట్ పొందొచ్చు. యూజర్ల ప్రైవసీకి ప్రాధాన్యం ఇస్తూ జియోపేజెస్ వెబ్ బ్రౌజర్‌ను తయారు చేసింది రిలయెన్స్ జియో. ఇన్‌కాగ్నిటో మోడ్‌లో ఇంటర్నెట్ ఉపయోగించడంతో పాటు సెక్యూరిటీ పిన్ లేదా బయోమెట్రిక్ సెక్యూరిటీ సెట్ చేసుకోవచ్చు. అనవసరమైన, హానికరమైన యాడ్స్‌ను ఈ బ్రౌజర్ బ్లాక్ చేస్తుంది. ప్రస్తుతం జియోపేజెస్ బ్రౌజర్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత JioPages టైప్ చేస్తే యాప్ కనిపిస్తుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :