Thursday, October 8, 2020

Google latest update. Alert if password is hacked



Read also:

Google latest update. Alert if the password is hacked
వినియోగదారులకు ఎప్పటికప్పుడూ యూజర్ ఫ్రెండ్లీ సర్వీస్‌లను అందించే గూగుల్, మరో అప్‌డేట్ ప్రకటించింది. స్మార్ట్ఫోన్ వినియోగదారుల కోసం గూగుల్ క్రోమ్ సెక్యూరిటీ అలర్ట్‌లను నోటిఫికేషన్ రూపంలో పంపిచనుంది.

వినియోగదారులకు ఎప్పటికప్పుడూ యూజర్ ఫ్రెండ్లీ సర్వీస్‌లను అందించే గూగుల్ మరో అప్‌డేట్ ప్రకటించింది. స్మార్ట్ఫోన్ వినియోగదారుల కోసం గూగుల్ క్రోమ్ సెక్యూరిటీ అలర్ట్‌లను నోటిఫికేషన్ రూపంలో పంపిచనుంది. ఒకవేళ మీ పాస్వర్డ్ హ్యాకింగ్ కు గురైతే క్రోమ్ గుర్తిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా పాస్‌వర్డ్‌లు హ్యాక్ అయ్యయో లేదో తనిఖీ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ గూగుల్ వెబ్ బ్రౌజర్ డెస్క్టాప్ వెర్షన్లో ఇప్పటికే అందుబాటులో ఉంది.
సర్వర్ల ద్వారా విశ్లేషణ
డేటా భద్రతను పటిష్టం చేసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని గూగుల్ ప్రకటించింది. ఈ ఫీచర్ సమర్థవంతంగా పనిచేయడానికి వినియోగదారుల పేర్లు, ఐడీలు, పాస్‌వర్డ్‌లను Google ఎప్పటికప్పుడు సర్వర్‌లకు పంపి విశ్లేషిస్తుంది. కానీ ఈ ప్రక్రియలో గూగుల్ తన కస్టమర్ల పేర్లు, పాస్‌వర్డ్‌లను దాచుకోదు. క్రోమ్ 86 బిల్డ్ అప్‌డేట్లో ఈ ఫీచర్‌ను అక్టోబర్ 6న ఆ సంస్థ ప్రకటించింది.
పాస్ వర్డ్ స్ట్రాంగ్ గా లేకపోతే హెచ్చరిక
వినియోగదారులు తమ పాస్‌వర్డ్‌లను Chromeలో సేవ్ చేసుకుంటేనే ఈ ఫీచర్ పనిచేస్తుంది. ఇలాంటి ఫీచర్లను గూగుల్ తో పాటు 1పాస్‌వర్డ్, మొజిల్లా ఫైర్‌ఫాక్స్, యాపిల్ సఫారి, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వంటి బ్రౌజర్‌లు కూడా అందిస్తున్నాయి. పాస్‌వర్డ్‌లు హ్యాకింగ్‌కు గురైతే వెంటనే వినియోగదారులకు ఇవి సెక్యూరిటీ అలర్డ్ పంపించి అప్రమత్తం చేస్తాయి. పాస్‌వర్డ్ స్ట్రాంగ్ గా లేకపోతే గుర్తించి, వినియోగదారులకు క్రోమ్ తెలియజేస్తుందని గూగుల్ తెలిపింది. కానీ నేరుగా పాస్‌వర్డ్‌లను మార్చుకోవడానికి ఈ విధానంలో ఎక్కువ సమయం పడుతుంది. ఏదైనా పాస్‌వర్డ్ ను మార్చుకోవడానికి వినియోగదారులను సంబంధిత వెబ్‌సైట్లో "చేంజ్ పాస్‌వర్డ్" ఆప్షన్ కు నేరుగా తీసుకువెళ్తుంది. ఇందుకు కాస్త సమయం పట్టవచ్చు.
iOS వినియోగదారులకు మరిన్ని ఫీచర్లు
దీంతో పాటు మరిన్ని కొత్త ఫీచర్లను క్రోమ్ ఈ అప్‌డేట్‌లో విడుదల చేసింది. ఇంటర్నెట్‌ బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు వినియోగదారుల భద్రతకు భరోసా కల్పిస్తామని సంస్థ తెలిపింది. iOSలో పాస్‌వర్డ్‌లను అథెంటికేట్ చేయడానికి టచ్-టు-ఫిల్ పాస్‌వర్డ్‌ ఫీచర్ ను క్రోమ్ అందిచనుంది. వినియోగదారులు టచ్ ఐడి, ఫేస్ ఐడి ఫీచర్ల ద్వారా ఈ సేవలు పొందవచ్చు. క్రోమ్ పాస్‌వర్డ్ మేనేజర్ iOS వినియోగదారులకు ఆటోఫిల్ సేవ్‌డ్ పాస్వర్డ్ సేవలను అందించనుంది. ఇందుకు సెట్టింగ్స్‌లో Chrome ఆటోఫిల్ ఆప్షన్ ను ఎనేబుల్ చేయాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :