Sunday, October 25, 2020

Fruits for Weight Loss



Read also:

తెలియకుండానే చాలామంది బరువు పెరిగిపోతుంటారు. ఇలాంటి వారు తిరిగి ఆ బరువు తగ్గించుకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అయితే. కొన్ని పండ్లను తినడం ద్వారా బరువు తగ్గొచ్చని కూడా నిపుణులు చెబుతున్నారు. ఆ పండ్లేంటో తెలుసుకుందాం.

బొప్పాయి-యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ఈ పండుని తినడం వల్ల జీర్ణాశయ సమస్యలు తగ్గి సులువుగా బరువు తగ్గుతారు. ఈ పండు ముక్కలపై కాసింత మిరియాల పొడి చల్లుకుని తినడం వల్ల మరింత ప్రమోజనం. ఒక 2, 3 నెలలు బొప్పాయిపండు తిని చూడండి. తేడా మీకే తెలుస్తుంది అంటున్నారు డాక్టర్లు.

రేగుపండ్లు-విటమిన్ సి, ఫైబర్ కలిగి ఉన్న ఈ పండ్లు బరువు తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. వీటిని తినడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. కాకపోతే ఇవి అన్ని కాలాలలో లభించవు. ఎండాకాలంలో ఎక్కువగా ఉంటాయి

స్ట్రాబెర్రీస్ : విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్న ఈ పండ్లను తినడం వల్ల బరువు త్వరగా తగ్గుతారని తేలింది. అంతేకాదు, ఈ పండ్లు కాన్సర్ కారకాలతో పోరాడుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఆపిల్స్: రోజుకో ఆపిల్ తీసుకోవడం వల్ల శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. దీని వల్ల బరువు కూడా త్వరగా తగ్గుతారు.

ద్రాక్ష: పొటాషియం ఎక్కువగా ఉండే ద్రాక్ష పండ్లు కూడా బరువుని సులభంగా తగ్గిస్తాయి. ఇందులోని ప్రత్యేక గుణాలు. దాహార్తిని కూడా తీరుస్తాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :