Tuesday, October 20, 2020

Corona Test



Read also:

కరోనా ఉందో లేదో తెలుసుకోవడానికి డాక్టర్లు ప్రత్యేక టెస్టులు చేస్తున్నారు. ఐతే, ఇంట్లోనే ఉంటూ కూడా కొబ్బరి, పుదీనాతో టెస్ట్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.

ఇండియాలో కరోనా వ్యాపించినప్పటి నుంచి చాలా మందికి తమకు కరోనా సోకిందేమో అనే డౌట్ ఉంది. ఆ విషయాన్ని నిర్ధారించుకోవడానికి టెస్ట్ చేయించుకుందామంటే. లక్షణాలు కనిపించట్లేదు. అందువల్ల చాలా మంది సందిగ్ధంలో ఉంటున్నారు. పైగా కరోనా లక్షణాలు అందరికీ ఒకేలా లేవు. ఒకసారి సోకి, నయమైన వారికి మళ్లీ కరోనా సోకదన్న గ్యారెంటీ కూడా లేదు. అందుకే ఈ కరోనా అనుమానం బాగా ఉంది. ఈమధ్య ఎక్కువ మంది కరోనా సోకాక. వాసనను గ్రహించే లక్షణాన్ని కోల్పోతున్నారు. తాజాగా ఇండియాలో ఓ అధ్యయనం చేశారు సైంటిస్టులు. ఇదో ఆసక్తికర అధ్యయనం. ఇందులో పరిశోధకులు. కరోనా అనుమానితులకు ఐదు రకాల వాసనలు చూపిస్తున్నారు. ఏ వాసన దేనిదో కనిపెట్టాలని కోరుతున్నారు. అవి ఏ వాసనలంటే. పుదీనా, వెల్లుల్లి, కొబ్బరి నూనె, యాలకులు, సోంపు. సైంటిస్టులు ఈ వాసనలకు సంబంధించిన కిట్ లను ప్రజలకు ఇచ్చి ఇంటికి పట్టుకెళ్లమన్నారు. ఇంట్లోనే ఈ టెస్ట్ చేసుకోమన్నారు. ఈ కిట్ లో పైకి ఏదీ కనిపించదు. విడివిడిగా వాసనలు మాత్రమే వస్తాయి. ఆ వాసనల్ని గుర్తించి. లోపల ఉన్నవి ఏవో కనిపెట్టాలి.

కొంతమంది కొబ్బరి నూనె, పుదీనా వాసనల్ని గుర్తించలేకపోయారు. అవేంటో తమకు తెలియట్లేదు అన్నారు. వాళ్లకు కరోనా చాలా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అధ్యయనంలో పాల్గొన్న వారిలో. 25 శాతం మంది పుదీనా వాసన గుర్తించలేకపోయారు, 21 శాతం మంది కొబ్బరి నూనె వాసనను కనిపెట్టలేకపోయారు. వాళ్లందరికీ కరోనా ఉంది. వందేర్ బిల్ట్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ రీసెర్చ్ టీమ్ కూడా ఇలాంటిదే మరో పరిశోధన చేసింది. కరోనా సోకిన వారికి పైన ఉండే శ్వాస నాళాలు కరోనా వల్ల మూసుకుపోతున్నాయి. అందువల్ల వాసన గుర్తించే గుణం కోల్పోతున్నారు. అక్కడ వైరస్ ఉండటం వల్ల వేడి పుడుతోంది. తద్వారా వాసనను గుర్తించలేకపోతున్నారని తేలింది.

సాధారణ జలుబు, జ్వరం వంటివి వచ్చినప్పుడు కూడా కొంత మంది వాసనను గుర్తించలేరు. అందువల్ల వాసనలు గుర్తించలేని వారందరికీ కరోనా వచ్చినట్లే అని అనుకోలేం. కాకపోతే... ఎవరైనా కొబ్బరి నూనె, పుదీనా వాసనల్ని గుర్తించలేకపోతే మాత్రం వెంటనే వెళ్లి ఆస్పత్రిలో టెస్ట్ చేయించుకోవడం మేలు. తద్వారా త్వరగా వైరస్ సోకిన విషయాన్ని తెలుసుకోవచ్చు. త్వరగా ట్రీట్ మెంట్ ప్రారంభిస్తే... కరోనా త్వరగా నయమయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉంటున్నాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :