Friday, September 25, 2020

SP balasubramanyam garu passes away



Read also:

SP బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత ప్రముఖ నేపథ్య గాయకుడు SP బాలసుబ్రహ్మణ్యం ఇకలేరు . కరోనాతో ఆగస్టు 4 న చెన్నైలోని MGM ఆస్పత్రిలో చేరిన బాలు కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు . కరోనా నుంచి కోలుకున్నా ఇతర అనారోగ్య సమస్యల కారణంగా బాలు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు . నిపుణులైన వైద్య బృందం చికిత్స అందిస్తూ వస్తున్నా ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాలేదు బాలు మృతితో చిత్ర పరిశ్రమ ఓ దిగ్గజ గాయకుడిని కోల్పోయినట్లయింది .

SP_Balu

అమృత కంఠం మూగబోయింది. గాన గంధర్వుడు, ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మనకిక లేరు. కరోనా సోకడంతో గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలకు గురైన ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 1.04గంటలకు తుదిశ్వాస విడిచారు. తన గానంతో కోట్లాది మంది సంగీత ప్రియుల్ని వీనుల విందు చేసిన సంగీత యోధుడి మరణం యావత్‌ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఆగస్టు 5న ఎస్పీబీ తనకు కరోనా సోకినట్టు ప్రకటించారు. ఆ తర్వాత చికిత్స నిమిత్తం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి అక్కడే చికిత్స పొందుతున్న బాలు ఆరోగ్యం గతంలో ఓసారి విషమించడంతో ఎక్మో, వెంటిలేటర్‌ సాయంతో చికిత్స కొనసాగిస్తూ వచ్చారు. అయినా ఫలిలేకపోయింది.


కొన్ని రోజుల కిందట కరోనా నెగెటివ్‌ రావడంతో ఎస్పీబీ కోలుకున్నారని, పూర్తి ఆరోగ్యంతో బయటకు వస్తారని అభిమానులంతా భావించారు. బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్‌ ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యంపై సమాచారం అందిస్తూ వచ్చారు. ‘నాన్న ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోంది. ఫిజియో థెరఫీ కొనసాగుతోంది. ద్రవ పదార్థాలు తీసుకుంటున్నారు. ఆస్పత్రి నుంచి బయటపడాలనే ఆతృతతో ఉన్నారు’ అంటూ కొద్ది రోజుల కింద ప్రకటించడంతో బాలు క్షేమంగా బయటకొస్తారని, మళ్లీ సంగీతంతో తమను అలరిస్తారని అందరూ సంతోషించారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. తాజాగా మరోసారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఎస్పీబీ కన్నుమూశారు. బాలు మృతి పట్ల యావత్‌ సినీ, సంగీత ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు సంతాపం తెలిపారు. ఒక మహోన్నత గాయకుడిని దేశం కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :